Share News

Delivery Fee: ఇలా చేస్తే డెలివరీ ఫీజుల బెడద వదిలిపోతుంది.. మహిళ పోస్టుపై నెట్టింట మిశ్రమ స్పందన

ABN , Publish Date - Sep 23 , 2025 | 06:15 PM

డెలివరీ యాప్‌లు వసూలు చేసే వివిధ రకాల ఫీజుల నుంచి తప్పించుకునేందుకు తానో చిట్కా ఫాలో అవుతున్నానంటూ ఓ మహిళ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. రిస్క్ చేస్తున్నావంటూ కొందరు మహిళను హెచ్చరించే ప్రయత్నం చేశారు.

Delivery Fee: ఇలా చేస్తే డెలివరీ ఫీజుల బెడద వదిలిపోతుంది.. మహిళ పోస్టుపై నెట్టింట మిశ్రమ స్పందన
Hack to Avoid Delivery Fees

ఇంటర్నెట్ డెస్క్: జొమాటో, స్విగ్గీ లాంటి యాప్‌లల్లో డెలివరీ ఫీజు చెల్లించడం ఇష్టం లేని ఓ మహిళ తానో కొత్త చిట్కా కనుక్కున్నానని చెప్పుకొచ్చింది. ఈ టెక్నిక్‌తో అధిక ఫీజుల బెడద వదిలిపోతుందని పేర్కొంది. ఆమె చిట్కా నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతున్నప్పటికీ జనాలు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రిస్క్ తీసుకున్నావని మరికొందరు కామెంట్ చేశారు.

తన టెక్నిక్ ద్వారా చవకలో కావాల్సినవి తెప్పించుకోవచ్చని ఆమె పేర్కొంది. తనకు నచ్చిన రెస్టారెంట్‌‌కు నేరుగా కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ పెట్టాక ర్యాపిడో పిక్ అప్ ద్వారా ఫుడ్‌ను ఇంటికి తెప్పించుకుంటానని ఆమె పేర్కొంది. ‘జొమాటో, స్విగ్గీలను వాడటం మానేశా. ఇప్పుడు రెస్టారెంట్‌లకు కాల్ చేసి ఫుడ్ రెడీ చేయమని చెబుతున్నా. ఆ తరువాత అక్కడికి ర్యాపిడో లేదా ఊబర్ పికప్‌ను పంపించిన తెప్పించుకుంటా. డెలివరీ ఖర్చుల కింద రూ.50 నుంచి రూ.100 వరకూ చెల్లిస్తున్నా యాప్స్ ద్వారా కంటే ఇక్కడ ఖర్చు తక్కువగానే అవుతోంది. యాప్‌లల్లో మార్కప్, ప్లాట్‌ఫామ్ ఫీ, కమిషన్ల కింద చాలా పోతోంది. కాబట్టి ఇదే నాకు లాభదాయకంగా అనిపించింది’ అని ఆమె పోస్టు పెట్టింది.

2.jpg


ఈ పోస్టుపై జనాలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొందరు ఆమెతో ఏకీభవించారు. యాప్‌లల్లో ధరలు 40 శాతం నుంచి 50 శాతం వరకూ ఎక్కువగా ఉంటున్నాయని అన్నారు. కొన్ని సందర్భాల్లో 60 శాతం వరకూ అధికంగా ఉంటున్నాయని చెప్పుకొచ్చారు. తామూ ర్యాపిడో లేదా పోర్టర్ ద్వారా వాటిని తెప్పించుకుంటున్నామని అన్నారు. కొందరు మాత్రం ఈ ఐడియాతో రిస్క్ ఎక్కువని ఆమెను హెచ్చరించారు. కస్టమర్లకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా వస్తువులను డెలివరీ చేస్తున్నందుకే యాప్‌లు డబ్బులు తీసుకుంటున్నాయని గుర్తు చేశారు.

‘వస్తువుల డెలివరీ సమయంలో ఎదురయ్యే చిక్కులన్నీ యాప్‌లే భరిస్తుంటాయి. అదే ఇలా పికప్ ద్వారా వాటిని తెప్పించుకుంటే ఈ రిస్క్ అంతా కస్టమర్ భరించాల్సి వస్తుంది. పికప్ సర్వీసు ఇచ్చే యాప్స్ భరించవు’ అని పేర్కొన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి:

యూపీఐ అంటే ఇదీ.. పోయిందనుకున్న ఫోన్ దొరకడంతో సంబరపడ్డ జంట

మీరు ట్వీట్ చేయగలుగుతోంది భారతీయులు, చైనీయుల వల్లే.. ఎక్స్ మాజీ ఉద్యోగి

Read Latest and Viral News

Updated Date - Sep 23 , 2025 | 09:33 PM