Railways: సొరంగాలు, వంతెనలపై రైళ్లు నెమ్మదిగా వెళతాయి.. ఇలా ఎందుకో తెలుసా
ABN , Publish Date - Oct 23 , 2025 | 10:16 PM
సొరంగాల్లో, వంతెనలపై రైళ్లు కాస్త నెమ్మదిగా వెళుతుంటాయి. ఇలా ఎందుకు? అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? మరి దీని వెనుక కారణాలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఏయే ప్రాంతాల్లో రైళ్లు ఎంత వేగంతో వెళ్లాలనే విషయంలో కచ్చితమైన ఇంజినీరింగ్ మార్గదర్శకాలు ఉంటాయి. ముఖ్యంగా సొరంగాలు, వంతెనల మీదుగా రైళ్లు కాస్త తక్కువ వేగంతో వెళతాయి. దీని వెనక పలు శాస్త్రసాంకేతిక అంశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు (train speed reduction tunnels).
వంతెనలపై రైళ్లు నెమ్మదిగా వెళతాయి. దీని వల్ల రైలు బరువు తాలూకు ప్రభావం వంతెనపై అన్ని వైపులా సమానంగా వ్యాపిస్తుంది. వేగంగా వెళ్లిన సమయాల్లో వంతెనలోని కొన్ని భాగాలపై ఎక్కువ బరవు పడి సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది (trains slow before bridges).
వంతెనలు, లేదా సొరంగాల్లో నుంచి వెళ్లేటప్పుడు రైలు చుట్టూ గాలి పీడనంలో ఆకస్మిక మార్పులు వస్తాయి. దీని వల్ల రైల్లో ప్రకంపనలు చోటుచేసుకుని ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతుంది. ఈ సమస్యను నివారించేందుకు రైళ్లు వేగాన్ని తగ్గించుకుంటాయి.
ఇక కొన్ని టన్నెల్స్, వంతెనలపై ఆకస్మిక మలుపులు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో నెమ్మదిగా వెళితే లోకోపైలట్‌లకు సమస్యలు ఎదురైనప్పు స్పందించే అవకాశం చిక్కుతుంది. వేగంగా వెళితే ఈ అవకాశం దక్కక ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఉష్ణోగ్రతల కారణంగా వంతెనలపై పట్టాలు సంకోచవ్యాకోచాలకు గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు వేగంగా వెళితే పట్టాల మధ్య ఎడం పెరిగి ప్రమాదాలు ఎదురయ్యే ముప్పు ఉంది. ఇక బరువు ఎక్కువగా ఉండే గూడ్స్ రైళ్లు, ప్యాసెంజర్ రైళ్లతో పోలిస్తే మరింత నెమ్మదిగా వెళతాయి.
అయితే, హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు మాత్రం తమ మార్గాల్లో దాదాపు ఒకే వేగంతో వెళుతుంటాయి. రైలు డిజైన్, ట్రాక్స్ నిర్మాణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ ట్రెయిన్స్ వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉండదు.
ఇవీ చదవండి:
తండ్రి ప్రేమ అంటే ఇదీ.. కూతురి కోసం దీపావళి నాడు..
భారతీయ యువకుడి వినూత్న కెరీర్.. డెంటిస్ట్‌గా మొదలెట్టి చివరకు యాపిల్‌లో ఏఐ ఇంజినీర్‌గా..