Chhattisgarh Farmer Viral Story: తండ్రి ప్రేమ అంటే ఇదీ.. కూతురి కోసం దీపావళి నాడు..
ABN , Publish Date - Oct 23 , 2025 | 08:14 PM
పైసాపైసా కూడబెట్టి కూతురికి దీపావళి నాడు మర్చిపోలేని బహుమతి ఇచ్చిన ఓ తండ్రి ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఉదంతం వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: కూతురి సంతోషం కోసం అహరహం శ్రమించిన ఓ సామాన్య రైతు.. దీపావళి నాడు ఆమెకు జీవితాంతం గుర్తుండే బహుమతి ఇచ్చిన వైనం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. తండ్రి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ రైతు ఉదంతం జనాలను కదిలిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది (Chhattisgarh Farmer Viral Video).
జష్‌పూర్‌లోని కేస్రా గ్రామానికి చెందిన బజ్‌రంగ్ రామ్ భగత్ ఓ సామాన్య రైతు. తన కూతురు చంపా భగత్‌కు స్కూటీని బహుమతిగా ఇద్దామని భావించాడు. ఇందుకోసం అతడు ఆరు నెలల పాటు కష్టపడి డబ్బు కూడబెట్టాడు. దీపావళి నాడు తన కూతురు, భార్యతో కలిసి ఓ బ్యాగు నిండా డబ్బులు తీసుకుని స్థానిక షోరూమ్‌కు వెళ్లాడు. పండుగ నాడు తన కూతురికి బహుమతిగా స్కూటీ కొనాలని అనుకుంటున్నట్టు సిబ్బందితో చెప్పాడు. కొంత మొత్తాన్ని రూ.10 నాణేల రూపంలో తేచ్చానని అన్నాడు. ఈ నాణేలను తీసుకుంటారా? అని షోరూమ్ సిబ్బందిని సంకోచిస్తూనే అడిగాడు.
బజ్‌రంగ్ తండ్రి మనసును అర్థం చేసుకున్న షోరూమ్ ఓనర్ ఆనంద్ గుప్తా వెంటనే అతడి అభ్యర్థనను అంగీకరించాడు. నాణేలను లెక్కించాలని సిబ్బందిని పురమాయించాడు. ఈ క్రమంలో రూ.40 వేలను నాణేలుగా చెల్లించిన బజ్‌రంగ్ మిగతా మొత్తాన్ని కరెన్సీ నోట్ల కింద చెల్లించి స్కూటీని బహుమతిగా ఇచ్చాడు. స్కూటీ సొంతమైనందుకు సంతోషపడుతున్న కూతురిని చూసి అతడు మరింతగా సంబరపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
దీపావళి నాడు దారుణం.. నడుముకు 1000 వాలాను చుట్టుకుని వెలిగించడంతో..
భారతీయ యువకుడి వినూత్న కెరీర్.. డెంటిస్ట్‌గా మొదలెట్టి చివరకు యాపిల్‌లో ఏఐ ఇంజినీర్‌గా..