Diwali Stunt Viral Video: దీపావళి నాడు దారుణం.. నడుముకు 1000 వాలాను చుట్టుకుని వెలిగించడంతో..
ABN , Publish Date - Oct 21 , 2025 | 05:18 PM
దీపావళి నాడు ప్రమాదకరమై స్టంట్ చేసిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి జనాలు స్టంట్ చేసిన వ్యక్తిని తెగ తిట్టిపోస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దీపావళికి టపాసులు కాల్చడంలో వింత ఏమీ లేదు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని కొందరు ఈ టైమ్‌లో కూడా తమ దుస్సాహసాలను ప్రదర్శించేందుకు రెడీ అయిపోతుంటారు. వ్యూస్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలోని వ్యక్తి చేసిన స్టంట్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇదేం పోయే కాలం అంటూ కామెంట్స్ చేస్తున్నారు (Dangerous Diwali Stunt).
వీడియోలోని వ్యక్తి ఏకంగా థౌజెండ్ వాలా టపాసుల దండను తన నడుముకు, కాళ్లకు చుట్టుకున్నాడు. ప్యాంటు ధరించిన అతడు ఒంటిపై షర్టు లేకుండానే ఈ సాహసానికి దిగాడు. అతడి చేతులను పక్కనే ఉన్న స్తంభాలకు కట్టేశారు. అంటే.. నొప్పి తాళలేక పారిపోదామనుకున్నా కుదరని పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఓ వ్యక్తి వచ్చి అతడి ఒంటిపై ఉన్న టపాసులను వెలిగించడంతో అవి పెద్ద శబ్దం చేస్తూ పేలడం ప్రారంభించాయి. దీంతో, ఆ వ్యక్తి భయం, నొప్పి తాళలేక చిందులు తొక్కాడు. చేతులను తాళ్లతో సంభానికి కొట్టేయడంతో అతడు ఎక్కడికీ పారిపోలేకపోయాడు. చివరకు టపాసులు మొత్తం అయిపోవడంతో అతడు బయటపడ్డాడు. ఈ షాకింగ్ సన్నివేశం చూసి అక్కడున్న జనాలు నోరెళ్లబెట్టారు (Diwali video 2025).
ఇక నెట్టింట కూడా ఈ ఉదంతం వైరల్‌గా మారింది. జనాలను ఆశ్చర్యపోయేలా చేసింది. వ్యూస్ కోసం కొందరు ఇలా తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారంటూ అనేక మంది విమర్శలు గుప్పించారు. ఇలాంటి వారికి చట్టప్రకారం బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మరి మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
భారతీయ యువకుడి వినూత్న కెరీర్.. డెంటిస్ట్‌గా మొదలెట్టి చివరకు యాపిల్‌లో ఏఐ ఇంజినీర్‌గా..
వివాహితతో ఎఫైర్.. ఆమె భర్తకు లవర్ పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు