AI Electricy Consumption: ఏఐ వినియోగం పెరిగే కొద్దీ భారీగా పెరిగే విద్యుత్ ఖర్చులు: జోహో వ్యవస్థాపకుడి హెచ్చరిక
ABN , Publish Date - Oct 07 , 2025 | 10:12 PM
ఏఐ వినియోగం పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగం గ్రిడ్స్ తట్టుకోలేని స్థాయికి చేరుకుంటుందని జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు హెచ్చరించారు. విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతాయని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ వినియోగం పెరిగే కొద్దీ విద్యుత్ బిల్లులు తడిసిమోపెడు అవుతాయని జోహో కార్పొరేషన్ ఫౌండర్ శ్రీధర్ వెంబు తాజాగా హెచ్చరించారు. విద్యుత్ గ్రిడ్స్‌పై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా హెచ్చరించారు.
2023తో పోలిస్తే ఏథెన్స్, జార్జియాలో ప్రస్తుతం విద్యు్త్ బిల్లులు ఏకంగా 60 శాతం మేర పెరిగాయని శ్రీధర్ వెంబు అన్నారు. ఏఐ డాటా సెంటర్లు పెరగడమే ఇందుకు కారణమని అన్నారు. డాటా సెంటర్ల జీపీయూ ఖర్చులు భరించగలిగినా విద్యు్త్ బిల్లులను తట్టుకోవడం మాత్రం ఎవ్వరితరం కాదని చెప్పారు. చివరకు ఈ భారం సామాన్య కుటుంబాలు, పరిశ్రమలపై పడుతుందని హెచ్చరించారు.
ఇంధన వినియోగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ సాంకేతిక ఏమాత్రం సమర్థవంతమైనది కాదని ఆయన అన్నారు. కాబట్టి, భారత్ తన డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటుపై లోతుగా ఆలోచించాలని సూచించారు. శక్తివనరులను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే ఏఐ వ్యవస్థల అవసరం ఉందని అన్నారు. ఏఐ కంప్యూటేషన్‌లో మౌలిక మార్పులు రావాలని అభిప్రాయపడ్డారు.
నిపుణుల అంచనా ప్రకారం, భారత్‌లో 2030 నాటికి ఏఐ విద్యుత్ వినియోగం ఏటా 40 నుంచి 50 టెర్రావాట్ అవర్‌కు చేరుకుంటుంది. గృహ వినియోగానికి, పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ సరఫరా చేయలేక ఇబ్బంది పడే గ్రిడ్స్‌పై ఇది భారం మరింత పెంచుతుంది.
భారత్ అప్పటికి 777 జీడబ్ల్యూ విద్యుత్ ఉప్పత్తికి ప్రయత్నిస్తోంది. అయితే, పర్యావరణ ఇంధన ఉత్పత్తి టార్గెట్స్‌లో ఏమాత్రం లోటు తలెత్తినా ప్రాంతీయంగా విద్యుత్ కొరత తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏఐ డాటా సెంటర్స్ ఎక్కువగా ఉన్నా ప్రాంతాలపై ప్రభావం పడుతుంది. ప్రాంతాల వారీగా కొరత వస్తుంది. చివరకు ఇది విద్యుత్ కోతలకు దారి తీసే అవకాశం కూడా ఉంది. ఇది చాలదన్నట్టు ప్రాంతీయ గ్రిడ్స్ విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోలేక కోతలకు తెరతీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి:
దరిద్రంలో మగ్గుతుండగా బంపర్ లాటరీ.. ఆ సంబరంలో ఉండానే ఊహించని షాక్
నువ్వు ఇండియాకు తిరిగెళతావన్న నమ్మకం మాకు లేదు.. యువకుడికి షాకిచ్చిన అమెరికా