US Visa Plea Rejection: నువ్వు ఇండియాకు తిరిగెళతావన్న నమ్మకం మాకు లేదు.. యువకుడికి షాకిచ్చిన అమెరికా
ABN , Publish Date - Oct 06 , 2025 | 09:30 PM
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేని యువకుడికి ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది. యువకుడు చదువయ్యాక ఇండియాకు తిరిగెళతాడన్న నమ్మకం తమకు లేదంటూ అమెరికా అధికారులు అతడికి వీసాను నిరాకరించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం అమెరికా వీసా దక్కించుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఏ చిన్న అనుమానం కలిగినా అమెరికా అధికారులు వీసా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఓ భారతీయుడికి సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది (US Visa Plea Rejection).
ఆ యువకుడి పేరు కౌషిక్ రాజ్. అతడి వయసు 27 ఏళ్లు. కొలంబియా యూనివర్సిటీలో జర్నలిజం కోర్సు చేసేందుకు అతడికి లక్ష డాలర్ల స్కాలర్‌షిప్ కూడా వచ్చింది. దీంతో, అతడు వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అమెరికా అధికారులు మాత్రం షాకిచ్చారు. చదువయ్యాక అతడు భారత్‌కు తిరిగెళతాడన్న నమ్మకం తమకు కలగలేదని చెప్పారు. అందుకే వీసాను తిరస్కరిస్తున్నామ్మంటూ లేఖ రాశారు.
‘ఈ వీసాను కోరే వారు తమ సొంత దేశంతో అనుబంధం ఉన్నట్టు రుజువు చేసుకోవాలి. ఉద్యోగం, కుటుంబం, సామాజిక బంధాలు వంటివి చూపెట్టాలి. కానీ మీరు ఇలాంటివేవీ చూపించలేకపోయారు’ అని తనకు రిజెక్షన్ లెటర్ అందినట్టు యువకుడు తెలిపాడు. ఈ తిరస్కరణను సవాలు చేస్తూ అప్పీలు చేసుకునే అవకాశం లేదని కూడా లేఖలో పేర్కొన్నారని వివరించాడు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటే పరిస్థితుల్లో ఏ మేరకు మార్పు వచ్చిందో కూడా చెప్పాలని లేఖలో పేర్కొన్నారని అన్నారు.
తాను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేనని సదరు యువకుడు తెలిపాడు. కానీ గతంలో తను జర్నలిస్టుగా పనిచేశానని, తన వార్తలకు సంబంధించి కొన్ని లింకులు మాత్రమే పోస్టు చేశానని తెలిపారు. వివాదాస్పద విషయాలపై ఎలాంటి పోస్టులు పెట్టలేదని అన్నారు. బహుశా ఈ కారణంగానే తనకు వీసా రాకపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, తనకు వచ్చిన రిజెక్షన్ లెటర్‌లో మాత్రం సోషల్ మీడియా ప్రస్తావన లేదని అన్నారు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. జనాలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
వీళ్లసలు మనుషులేనా.. అర్ధరాత్రి రైల్లో ఈ మహిళలు ఎలా రెచ్చిపోయారో చూస్తే..
ఈ రాజుకు 15 మంది భార్య.. షాకింగ్ వీడియో వైరల్