Share News

Viral Video: ఇదేంది అక్కా.. కొంచెం ఆగాలి కదా.. రైల్వే గేట్ దగ్గర తొందరపడిన ఓ మహిళ పరిస్థితి చూడండి..

ABN , Publish Date - Mar 11 , 2025 | 08:35 AM

కొంత మంది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, రైల్వే క్రాసింగ్స్ దగ్గర ఆగడానికి ఇబ్బందిపడుతుంటారు. షార్ట్ కట్స్ వెతుక్కుని ముందుకు వెళ్లిపోవాలని తహతహలాడుతుంటారు. ఆ క్రమంలో ఇతరులను ఇబ్బంది పెడుతుంటారు. లేదా స్వయంగా ప్రమాదంలో చిక్కుకుంటారు.

Viral Video: ఇదేంది అక్కా.. కొంచెం ఆగాలి కదా.. రైల్వే గేట్ దగ్గర తొందరపడిన ఓ మహిళ పరిస్థితి చూడండి..
Bike crossing railway gate

చాలా మంది రోడ్ల మీద వెళ్లేటపుడు చాలా తొందరగా ఉంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, రైల్వే క్రాసింగ్స్ (Railway Crossing) దగ్గర ఆగడానికి ఇబ్బందిపడుతుంటారు. షార్ట్ కట్స్ వెతుక్కుని ముందుకు వెళ్లిపోవాలని తహతహలాడుతుంటారు. ఆ క్రమంలో ఇతరులను ఇబ్బంది పెడుతుంటారు. లేదా స్వయంగా ప్రమాదంలో చిక్కుకుంటారు. తాజాగా ఓ మహిళకు అలాంటి అనుభవమే ఎదురైంది. రైల్వే క్రాసింగ్ దగ్గర ఆ మహిళ చేసిన తొందరపాటు పని ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


bambang.soesatyo అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రైలు (Train) వచ్చే సమయం కావడంతో గేట్ వేశారు. అందరూ అక్కడ వేచి చూస్తున్నారు. కొందరు మాత్రం గేటును పైకి లేపి ముందుకు వెళ్లిపోతున్నారు. బైక్ మీద వెళ్తున్న ఓ మహిళ కూడా ఆ గేట్‌ను పైకి లేపి ముందుకు వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. అయితే ఆ గేట్ కొంత వరకే పైకి లేచింది. దాంతో ఆ మహిళ ఆ గేట్‌ను ఢీకొని బైక్ నుంచి కింద పడిపోయింది. ఓ వ్యక్తి ఆ ఘటన మొత్తాన్ని రికార్డు చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను కోట్ల మంది వీక్షించారు. 10 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. రైల్వే గేట్‌ను బలవంతంగా పైకి తెరవడం చాలా ప్రమాదకరం అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. అలాగే సహనంగా ఉండడం ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుందని, తొందరపడితే ఇదే పరిస్థితి ఎదురవుతుందని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

Jugaad Viral Video: వావ్.. టెక్నాలజీని ఇలా కూడా వాడొచ్చా.. ఈ వ్యక్తి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..


Snake Viral Video: బోనులోకి వెళ్లి గుడ్డును మింగిన పాము.. చివరకు దాని పరిస్థితి ఏమైందంటే..


Boy Stunt Video: ఈ కుర్రాడి ప్రతిభకు సలాం కొట్టాల్సిందే.. సైకిల్‌తో కళ్లు చెదిరే స్టంట్ చూస్తే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Mar 11 , 2025 | 08:35 AM