Share News

Jugaad Viral Video: వావ్.. టెక్నాలజీని ఇలా కూడా వాడొచ్చా.. ఈ వ్యక్తి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

ABN , Publish Date - Mar 10 , 2025 | 07:37 PM

కొందరు వ్యక్తులు తమ తెలివి తేటలు ఉపయోగించి చేసే పనులు చాలా మందిని బాగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Jugaad Viral Video: వావ్.. టెక్నాలజీని ఇలా కూడా వాడొచ్చా.. ఈ వ్యక్తి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
Jugaad machine

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి రోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కొందరు వ్యక్తులు తమ తెలివి తేటలు (Intelligence) ఉపయోగించి చేసే పనులు చాలా మందిని బాగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Jugaad Video).


@SUNILKASWAN79 అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను (Viral Video) సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. పశువుల కోసం గడ్డి (Gross)ని కోయడానికి ఓ వెరైటీ మెషిన్‌ను తయారు చేశారు. సాధారణంగా గ్రామాల్లో గడ్డిని కోయడానికి కత్తులతో శ్రమ పడతారు. అయితే ఈ వీడియోల పదునైన బ్లేడ్‌లను కలిగిన పెద్ద చక్రానికి మోటార్‌ను అమర్చి సులభంగా గడ్డిని కట్ చేసేస్తున్నారు. ఆ చక్రం తిరుగుతున్నప్పుడు గడ్డిని పెడితే అది ముక్కలైపోతోంది. ఆ వెరైటీ మెషిన్‌కు సంబంధించిన వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.3 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. చాలా మంచి ఆలోచన, సులభంగా పని అయిపోతుంది అని ఒకరు ప్రశంసించారు. ఇది నిజంగా మంచి టెక్నాలజీ అని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

Snake Viral Video: బోనులోకి వెళ్లి గుడ్డును మింగిన పాము.. చివరకు దాని పరిస్థితి ఏమైందంటే..


Boy Stunt Video: ఈ కుర్రాడి ప్రతిభకు సలాం కొట్టాల్సిందే.. సైకిల్‌తో కళ్లు చెదిరే స్టంట్ చూస్తే..



మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.,

Updated Date - Mar 10 , 2025 | 07:38 PM