Postman kind act: ఈ పోస్ట్‌మ్యాన్ ఎంత మంచివాడో.. ఆస్ట్రేలియా మహిళ ఫిదా.. లైక్ చేసిన ప్రియాంకా చోప్రా
ABN , Publish Date - Aug 18 , 2025 | 06:39 PM
ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన పోస్ట్‌మ్యాన్ చేసిన పని చాలా మందిని ఆకట్టుకుంటోంది. అతడు పార్శిల్ డెలివరీ చేయడానికి వెళ్లి తిరిగి వస్తూ చేసిన పని ఆ ఇంటి యజమానిని ఫిదా చేసింది. ఆ వీడియోను షేర్ చేసిన ఆస్ట్రేలియా మహిళ అతడిని పొగడ్తలతో ముంచెత్తింది.
ఆస్ట్రేలియా (Australia)లో భారత సంతతికి చెందిన పోస్ట్‌మ్యాన్ (Postman) చేసిన పని చాలా మందిని ఆకట్టుకుంటోంది. అతడు పార్శిల్ డెలివరీ చేయడానికి వెళ్లి తిరిగి వస్తూ చేసిన పని ఆ ఇంటి యజమానిని ఫిదా చేసింది. ఆ వీడియోను షేర్ చేసిన ఆస్ట్రేలియా మహిళ అతడిని పొగడ్తలతో ముంచెత్తింది. ఆ క్లిప్ సోషల్ మీడియాలో విపరతంగా వైరల్ అవుతోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. నటి ప్రియాంక చోప్రా కూడా ఈ వీడియోను లైక్ చేసింది (Viral Video).
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో నివసిస్తున్న వెర్రిటీ వాండెల్ అనే మహిళ తన ఇంటి సెక్యూరిటీ కెమెరాలో రికార్డైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భారత సంతతికి చెందిన ఓ సిక్కు పోస్ట్‌మ్యాన్ ఒక ప్యాకేజీని ఓ ఇంటికి డెలివరీ చేశాడు. తిరిగి వెళ్లేటపుడు వర్షం (Rain) పడటం గమనించాడు. ఆ ఇంటి బయట యార్డ్‌లో బెడ్‌షీట్‌లు ఆరేసి ఉన్నట్టు గమనించాడు. అవి వర్షంలో తడిసిపోతాయని భావించి వాటిని తీసి జాగ్రత్తగా లోపల ఉంచాడు. దీంతో అవి తడిసిపోకుండా ఉన్నాయి.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాండెల్.. 'నేను బయట ఉన్నప్పుడు వర్షం మొదలైంది. నేను బయటే వదిలేసిన బెడ్‌షీట్‌లు తడిసిపోతాయని అనుకున్నాను. ఇంటికి చేరుకునే సరికి ఆ బెడ్‌షీట్‌లు, పార్శిల్ బెంచ్ మీద ఉన్నాయి. ఆ బెడ్‌షీట్‌లు తడవలేదు. అసలేం జరిగిందో చూడడానికి సెక్యూరిటీ కెమెరా చూశాను. అప్పుడు అసలు విషయం బయటపడింది. నేను అతడికి ధన్యవాదాలు తెలియజేయాలి' అని ఆమె కామెంట్ చేసింది. తర్వాత, ఆమె పోస్ట్‌మ్యాన్ గురుప్రీత్ సింగ్‌ను కలిసి ధన్యవాదాలు తెలియజేసింది.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. మరణం అంచుల వరకు వెళ్లొచ్చాడు.. మొసలి ఏం చేసిందో చూడండి..
వావ్.. ఏం తెలివి.. ఉల్లిపాయలను కట్ చేయడానికి ఈమె ట్రిక్ చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..