Viral Video: ఓర్నీ.. బ్రెయిన్ ఉంటే చాలు.. మిక్సీ కూడా అక్కర్లేదని నిరూపించాడుగా.. ఈ వీడియో చూస్తే..
ABN , Publish Date - Jan 25 , 2025 | 08:10 PM
చాలా మంది వెరైటీ ట్రిక్స్ ఉపయోగించి చేసే జుగాడ్ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటూ, మరికొన్ని వీడియోలు ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చాలా మంది వెరైటీ ట్రిక్స్ (Tricks) ఉపయోగించి చేసే జుగాడ్ వీడియోలు (Jugaad Videos) చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
altu.faltu అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో పోస్ట్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి నింజా టెక్నిక్‌ను ఉపయోగించి మిక్సీ (Mixer) లేకుండానే పచ్చడి (Chutney) చేసేశాడు. ఆ టెక్నిక్ చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియోలోని వ్యక్తి ఓ ప్లాస్టిక్ బాటిల్‌లో కొన్ని వెల్లుల్లి పాయలు, పచ్చి మర్చి వేశాడు. ఆ బాటిల్‌ను తీసుకెళ్లి లారీ చక్రం (Truck Tyre) కింద పెట్టాడు. ఆ ట్రక్ చక్రం ఆ బాటిల్‌పై నుంచి పలు సార్లు వెళ్లడంతో అది నలిగి పచ్చడిలా మారిపోయింది. ఆ వెల్లుల్లి, పచ్చి మిర్చీ మిక్సీ లేకుండానే చట్నీ అయిపోయాయి. మిక్సీ అవసరం లేకుండానే చట్నీని తయారుచేసే ఈ నింజా టెక్నిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించి, లైక్ చేశారు. ఈ జుగాడ్ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇతను ట్రక్కును దుర్వినియోగం చేస్తున్నాడు``, ``ట్రక్కు డ్రైవర్లు ఈ వీడియోను చూస్తే బాధపడతారు``, ``ఇలా చేస్తే చాలా మిక్సీలు మూతబడతాయి``, ``సూపర్ టెక్నిక్ బ్రదర్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Funny Viral News: భర్త మొహానికి లాక్.. బోనులో బంధించిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Snake bite video: పాపా.. పాముతో ఆటలాడితే అలాగే ఉంటుంది.. ఓ యువతి పరిస్థితి ఏమైందో చూడండి..
Tiger Hunting video: మూడు పులి పిల్లలు, ఒక జింక.. ఆ వేట చివరకు ఎలా ముగిసిందో చూడండి..
Optical Illusion: ఈ ఫొటోలో మొదట మీకు ఏం కనబడింది.. దానిని బట్టి మీ క్యారెక్టర్‌ను అంచనా వేయవచ్చు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి