Share News

Tiger Hunting video: మూడు పులి పిల్లలు, ఒక జింక.. ఆ వేట చివరకు ఎలా ముగిసిందో చూడండి..

ABN , Publish Date - Jan 25 , 2025 | 02:53 PM

రాజస్థాన్‌లో ఉన్న రణతంబోర్ నేషనల్ పార్క్ పులుల జనాభా, గొప్ప జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన వన్యప్రాణుల అభయారణ్యం. ఇది 1,334 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇది ప్రకృతి మరియు వన్యప్రాణుల ప్రేమికులకు చక్కని గమ్యస్థానంగా మారింది.

Tiger Hunting video: మూడు పులి పిల్లలు, ఒక జింక.. ఆ వేట చివరకు ఎలా ముగిసిందో చూడండి..
tiger hunting

వేట అనేది ఓ జంతువుకు ఆహార సమస్య. మరో జంతువుకు ప్రాణాపాయ సమస్య. బలమైన జంతువుకు ఆకలి వేసినపుడు బలహీనమైన జంతువుకు ఆయువు మూడినట్టే. ఇది ఆటవిక ధర్మం. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో వేట వీడియోలు (Hunting Videos) మన కళ్ల ముందుకు వచ్చాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని వైరల్‌గా మారాయి. తాజాగా రాజస్థాన్‌ (Rajasthan)లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌లో కొందరు టూరిస్ట్‌లు ఓ వేటను ప్రత్యక్షంగా చూశారు. ఆ ఘటనను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


ranthambhorepark అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. మూడు పులి పిల్లలు (Tiger Cubs) ఓ సాంబార్ జింక (sambar deer)ను తరుముకుంటూ వచ్చాయి. చివరకు ఓ రిజర్వాయర్ ఒడ్డు దగ్గర ఆ జింకను ఆ మూడు పిల్లలు పట్టుకున్నాయి. ఒక పులి ఆ జింక కాలును, మరొకటి తలను పట్టుకుని అదుపు చేశాయి. ఆ మూడు కలిసి దానిని చంపేశాయి. ఆ ఒడ్డునే దానిని తినేశాయి. జంగిల్ సఫారీ టూర్‌కు వెళ్లిన టూరిస్ట్‌లు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది వీక్షించారు. 46 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. కాగా, రాజస్థాన్‌లో ఉన్న రణతంబోర్ నేషనల్ పార్క్ పులుల జనాభా, గొప్ప జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన వన్యప్రాణుల అభయారణ్యం. ఇది 1,334 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇది ప్రకృతి మరియు వన్యప్రాణుల ప్రేమికులకు చక్కని గమ్యస్థానంగా మారింది.


ఇవి కూడా చదవండి..

Optical Illusion: ఈ ఫొటోలో మొదట మీకు ఏం కనబడింది.. దానిని బట్టి మీ క్యారెక్టర్‌ను అంచనా వేయవచ్చు..


Viral Video: వామ్మో.. హార్న్ కొడితే పరిస్థితి ఇలా ఉంటుందా? బస్సు డ్రైవర్లకు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు..


Viral Helmet Rule: ఇండియాలో ఇంతే.. హెల్మెట్ రూల్‌ను పెట్రోల్ బంక్ సిబ్బంది ఎలా పాటిస్తున్నారో చూడండి..


Viral News: కొంప ముంచిన పిల్లి.. చైనా మహిళ ఉద్యోగం ఊడింది.. బోనస్ పోయింది..


Optical Illusion Test: మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలోని రెండో డేగ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 25 , 2025 | 02:53 PM