Viral Video: ముందు, వెనుకా చూసుకోవాలి కదా అక్కా.. ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Jan 31 , 2025 | 08:36 PM
ప్రస్తుతం మహిళలు రైళ్లు, విమానాలు నడుపుతున్నప్పటికీ, బైక్‌లు, స్కూటీలు నడిపే విషయంలో మాత్రం కొందరు ఇప్పటికీ తడబడుతుంటారు. సిల్లీ మిస్టేక్స్ చేసి అనవసర ప్రమాదాలకు గురవుతుంటారు. లేదా ఎదుటి వారిని ప్రమాదాల బారిన పడేస్తుంటారు.

ప్రస్తుతం పురుషులతో సమానంగా అమ్మాయిలు, పెద్ద వయసు మహిళలు కూడా బైక్‌లు, స్కూటీలు నడుపుతున్నారు. ప్రస్తుతం మహిళలు రైళ్లు, విమానాలు నడుపుతున్నప్పటికీ, బైక్‌లు, స్కూటీలు నడిపే విషయంలో మాత్రం కొందరు ఇప్పటికీ తడబడుతుంటారు (Women Bike driving). సిల్లీ మిస్టేక్స్ చేసి అనవసర ప్రమాదాలకు గురవుతుంటారు. లేదా ఎదుటి వారిని ప్రమాదాల బారిన పడేస్తుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళల డ్రైవింగ్‌కు (Driving) సంబంధించి అనేక ఫన్నీ వీడియోలు, మీమ్స్ సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి.
aryantyagivlogs అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ స్కూటీ నడుపుతూ అకస్మాత్తుగా రోడ్డు మీదకు వచ్చేసింది. అదే సమయంలో ఆ రోడ్డు మీద వస్తున్న బైకర్ సడెన్‌గా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న బస్సు ఆ బైకర్‌ను ఢీకొట్టింది. ఆ దెబ్బకు ముందున్న మహిళ తూలి ముందుకు పడింది. అంతేకాదు ఈ రోడ్డు మీద వస్తున్న వాహనాలన్నీ వరుసగా ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఆ రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది.
ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను వేల మంది వీక్షించి, వందల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వావ్.. అక్క సూపర్ డ్రైవింగ్``, ``ఇంత మందిని ఇబ్బంది పెట్టాలంటే చాలా ట్యాలెంట్ కావాలి``, ``ఆ అక్క తన స్కూటర్ మీద బయటకు వెళ్లినపుడు రోడ్డు అంతా ఖాళీగా ఉండాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Car Stunt: ఇంత రిస్క్ అవసరమా తమ్ముడూ? వీడియో కోసం కారుతో స్టంట్ చేద్దామనుకుంటే..
Weight Loss: కేవలం 15 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గాడు.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ప్రాణం పోతున్నా ఆహారాన్ని వదలని కొండచిలువ.. చివరకు..
Optical Illusion: ఈ రంగు రంగుల రామచిలుకల మధ్య సీతాకోక చిలుక ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి