Car Stunt: ఇంత రిస్క్ అవసరమా తమ్ముడూ? వీడియో కోసం కారుతో స్టంట్ చేద్దామనుకుంటే..
ABN , Publish Date - Jan 31 , 2025 | 07:15 PM
కొందరు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చూస్తూ గంటలు గంటలు గడిపేస్తున్నారు. వారిని ఆకట్టుకునేందుకు మరికొందరు వీడియోలు రూపొందిస్తున్నారు. వ్యూస్, లైక్స్ కోసం విచిత్రమైన పనులు చేస్తున్నారు. కొందరు ప్రమాదకర సాహసాలు చేయడానికి సైతం సిద్ధపడుతున్నారు.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ మొబైల్స్‌కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చూస్తూ గంటలు గంటలు గడిపేస్తున్నారు. వారిని ఆకట్టుకునేందుకు మరికొందరు వీడియోలు రూపొందిస్తున్నారు. వ్యూస్, లైక్స్ కోసం విచిత్రమైన పనులు చేస్తున్నారు. కొందరు ప్రమాదకర సాహసాలు (Dangerous Stunts) చేయడానికి సైతం సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం (Car stunt gone wrong).
@vivek3780vivek అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో (Viral Video) ప్రకారం.. ఓ ఇంటి పైకప్పుపై కారుతో స్టంట్ చేయడానికి మొత్తం సిద్ధం చేశారు. పైకప్పుపై రెండు సమాంతర ప్లాట్‌ఫారమ్‌లను తయారు చేశారు. ఓ కారును కూడా ఆ ఇంటి రూఫ్ మీదకు తీసుకెళ్లారు. ఎత్తుగా ఉన్న ఓ ప్లాట్‌ఫామ్‌పై కారును వదిలారు. కారు అక్కడ నుంచి వేగంగా వెళ్లి ముందు ఉన్న భవనం పైకప్పు ల్యాండ్ కావాలనేది స్టంట్. అయితే లెక్క తప్పడంతో ఆ కారు ఆ భవనాన్ని చేరుకోలేక అంత ఎత్తు నుంచి నేరుగా కిందకు పడిపోయింది. దీంతో ఆ కారు నుజ్జునుజ్జయిపోయింది.
ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆరు లక్షల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``బ్రదర్ కనీసం రూ.3 లక్షలు కోల్పోయి ఉంటాడు``, ``ఇంత రిస్క్ అవసరమా తమ్ముడు``, ``ఇలాంటి వాళ్లును ఎవరూ మార్చలేరు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Weight Loss: కేవలం 15 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గాడు.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ప్రాణం పోతున్నా ఆహారాన్ని వదలని కొండచిలువ.. చివరకు..
Optical Illusion: ఈ రంగు రంగుల రామచిలుకల మధ్య సీతాకోక చిలుక ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..
Tooth sticks in Kumbh Mela: ప్రేయసి ఐడియా అదిరిందిగా.. కుంభమేళాలో వేప పుల్లలు.. వేలల్లో సంపాదన..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి