Viral Video: కండలు రావాలంటే కుక్క బిస్కెట్లు తినాలా? వీడియో చూస్తే షాక్‌తో ఆశ్చర్యపోవాల్సిందే..
ABN , Publish Date - Jan 29 , 2025 | 07:26 PM
ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యం కోసం వాకింగ్, జాగింగ్ చేస్తున్నారు. వీలైతే జిమ్‌లో కూడా జాయిన్ అయి చెమటోడుస్తున్నారు. అంతేకాదు వర్కవుట్‌కు తగినట్టుగా డైటింగ్ కూడా చేస్తున్నారు. ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నారు. ప్రోటీన్ పౌడర్లను జిమ్‌కు కూడా తీసుకెళ్తున్నారు.
ప్రస్తుతం చాలా మంది యువతీయువకులు ఫిట్‌నెస్ (Fitness)కు తగినంత ప్రాధాన్యం ఇస్తున్నారు. వాకింగ్, జాగింగ్ చేస్తున్నారు. వీలైతే జిమ్‌లో (Gym) కూడా జాయిన్ అయి చెమటోడుస్తున్నారు. అంతేకాదు వర్కవుట్‌కు తగినట్టుగా డైటింగ్ (Dieting) కూడా చేస్తున్నారు. ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నారు. ప్రోటీన్ పౌడర్లను జిమ్‌కు కూడా తీసుకెళ్తున్నారు. అయితే తాజాగా ఓ వ్యక్తి జిమ్‌లో వింత ఆహారం (Strange Food) తీసుకుంటూ కనిపించాడు. వేరే వ్యక్తి అతడి తీరును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
@HasnaZaruriHai అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కుర్రాడు జిమ్‌లో కాళ్లకు సంబంధించిన వర్కవుట్ చేస్తున్నాడు. ఆ సమయంలో అతడు ఓ ప్యాకెట్ తీసుకుని అందులోని ఫుడ్ తిన్నాడు. తీరా చూస్తే అది కుక్కలకు ఆహారం అందించే పెడిగ్రీ (Pedigree) బ్రాండ్ ఫుడ్. కుక్కలు తినే ఫుడ్‌ను (Dog Food) ఆ కుర్రాడు తన వర్కవుట్‌ల మధ్యలో తింటున్నాడు. అతడు ఎందుకు తింటున్నాడో మాత్రం క్లారిటీ లేదు. వేరే వ్యక్తి అతడి తీరును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 11 లక్షల మంది వీక్షించారు. రెండు వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ``పెడిగ్రీ తినడం వల్ల ఉపయోగం ఏంటి బ్రదర్``, ``మనిషి కుక్కలా మారాలంటేనే అలాంటి ఫుడ్ తినాలి``, ``అతడు వర్కవుట్ మధ్యలో డాగ్ ప్రోటీన్ తీసుకుంటున్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Prank video: సీన్ రివర్స్ అంటే ఇదే.. ప్రాంక్ వీడియో చేద్దామనుకుంటే దెబ్బలు తినాల్సి వచ్చింది..
Viral Video: డోంట్ టచ్ మీ.. ఆహారం అందించి కోతిని ముట్టుకున్న యువతికి షాక్.. ఏం జరిగిందో చూడండి..
Optical Illusion: మీ కంటి పవర్ రేంజ్ ఎంత?.. ఈ ఫొటోలో చేప ఎక్కడుందో కనిపెట్టండి..
Strange Job: ఓర్నీ.. ఇలా కూడా కోట్లు సంపాదించవచ్చా? ఈ వ్యక్తి జాబ్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి