Share News

Prank video: సీన్ రివర్స్ అంటే ఇదే.. ప్రాంక్ వీడియో చేద్దామనుకుంటే దెబ్బలు తినాల్సి వచ్చింది..

ABN , Publish Date - Jan 29 , 2025 | 05:24 PM

ఎలాగైనా సోషల్ మీడియాలో పాపులర్ అయిపోవాలనే ధ్యాసతో కొందరు రకరకాల పిచ్చి ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి వాటిల్లో ప్రాంక్ వీడియో ఒకటి. బహిరంగ ప్రదేశాల్లోనే వ్యక్తిని అయోమయానికి గురి చేసి నవ్వు పుట్టించమే ప్రాంక్ వీడియో. అలాంటి ఎన్నో ప్రాంక్ వీడియోలు సోషల్ మీడియా జనాలను ఆకట్టుకున్నాయి.

Prank video: సీన్ రివర్స్ అంటే ఇదే.. ప్రాంక్ వీడియో చేద్దామనుకుంటే దెబ్బలు తినాల్సి వచ్చింది..
Prank Gone Wrong

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మందికి వీడియోలు రూపొందించాలనే మోజు పట్టుకుంది. ఎలాగైనా సోషల్ మీడియాలో పాపులర్ అయిపోవాలనే ధ్యాసతో రకరకాల పిచ్చి ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి వాటిల్లో ప్రాంక్ వీడియో (Prank Video) ఒకటి. బహిరంగ ప్రదేశాల్లోని వ్యక్తులను అయోమయానికి గురి చేసి నవ్వు పుట్టించమే ప్రాంక్ వీడియో. అలాంటి ఎన్నో ప్రాంక్ వీడియోలు సోషల్ మీడియా జనాలను ఆకట్టుకున్నాయి. తాజాగా ఓ కుర్రాడు కూడా అలాంటి ప్రాంక్ వీడియో చేద్దామనుకున్నాడు. అయితే పరిస్థితి రివర్స్ అయి దెబ్బలు తిన్నాడు (Viral Video).


@gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. టీ స్టాల్ దగ్గర ఓ వ్యక్తి కూర్చుని హాయిగా టీ తాగుతున్నాడు. అతడి దగ్గరకు ఓ కుర్రాడు వెళ్లి వేరే వైపు చూపిస్తూ ``ఎవరో నిన్ను పిలుస్తున్నానర``ని చెప్పాడు. ఆ వ్యక్తి అటు వైపు చూడగానే అతడి చేతిలో ఉన్న టీలో ఏదో పౌడర్ వేశాడు. ఆ పౌడర్‌ను ఆ టీ తాగే వ్యక్తి చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆ కుర్రాడిని అందరిలోనూ చితక్కొట్టాడు. అది ప్రాంక్ అని చెప్పినా ఆ వ్యక్తి శాంతించలేదు. మొహంపై పలు సార్లు కొట్టడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Prank Gone Wrong).


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.25 లక్షల మంది వీక్షించారు. 17 వందల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ కుర్రాడికి తగిన శాస్తి జరిగింది``, ``ఆ ప్రాంక్ చాలా ఖరీదుగా మారిపోయింది``, ``ఇలాంటి వాళ్లు ఎదుటి వాళ్లను అసౌకర్యానికి గురి చేయడం తప్ప ఇంకేం చేయలేరు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: డోంట్ టచ్ మీ.. ఆహారం అందించి కోతిని ముట్టుకున్న యువతికి షాక్.. ఏం జరిగిందో చూడండి..


Optical Illusion: మీ కంటి పవర్ రేంజ్ ఎంత?.. ఈ ఫొటోలో చేప ఎక్కడుందో కనిపెట్టండి..


Viral News: ఫుడ్ స్టాల్ బోర్డుపై స్పెల్లింగ్ మిస్టేక్.. పొరపాటుగా నిజం చెప్పేశాడంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..


Strange Job: ఓర్నీ.. ఇలా కూడా కోట్లు సంపాదించవచ్చా? ఈ వ్యక్తి జాబ్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 29 , 2025 | 06:00 PM