Vande Bharat Rake Trail: వందేభారత్ స్లీపర్.. గాస్లు నిండా నీరు.. చుక్క నీరు కూడా ఒలకలేదుగా!
ABN , Publish Date - Nov 13 , 2025 | 09:40 PM
గరిష్ఠ వేగంతో వెళుతున్నా అసలు కుదుపులే లేకుండా వందే భారత్ స్లీపర్ రైళ్లను డిజైన్ చేసిన వైనం ఓ వీడియోలో అద్భుతంగా ఆవిష్కృతమైంది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: వందే భారత్ రైళ్లకు దేశంలో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ప్రధాన రూట్లలో ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వందేభారత్ స్లీపర్ రైళ్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ దిశగా తాజాగా నిర్వహించిన కొన్ని పరీక్షల తాలూకు వీడియోలు వైరల్‌గా మారాయి (Vande Bharat Water Test - Rake Trail).
గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నా స్వల్ప స్థాయి కుదుపులు కూడా లేకుండా ఈ రైళ్లను డిజైన్ చేస్తున్నారు. ఇది కళ్లకు కట్టినట్టు చూపించే వాటర్ టెస్టు వీడియో ఒకటి జనాలను ప్రస్తుతం అమితంగా ఆకట్టుకుంటోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య ఉన్న రోహల్‌ఖుర్ద్-ఇందర్‌గఢ్-కోటా సెక్షన్ రూట్‌లో ఈ పరీక్షను నిర్వహించారు. రైలు గరిష్ఠ వేగం, హైస్పీడులో ఉండగా ప్రయాణ సౌకర్యం, సుస్థిరత వంటి అంశాలను పరీక్షించారు (Indian Railways Viral Video).
వేగంగా వెళ్లేటప్పుడు కుదుపులు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు వాటర్ టెస్టు నిర్వహించారు. అంటే .. గాజు గ్లాసులను నిండుగా నీటితో నింపి కోచ్‌లోని డెస్క్‌పై పెట్టారు. రైలు ఫుల్ స్పీడులో వెళుతున్నా అందులో నుంచి చుక్క నీరు కూడా తొణకలేదు. ఆ తరువాత రెండు గ్లాసులను పక్కపక్కన పెట్టి దానిపై నీటితో నిండుగా ఉన్న మూడో గ్లాసును పెట్టారు. అప్పుడు కూడా అవే సన్నివేశాలు కనిపించాయి. వేగంగా వెళుతున్నా చిన్నపాటి కుదుపులు కూడా లేకపోవడంతో చుక్క నీరు కూడా ఒలకలేదు. ఈ పరీక్షల్లో ఈ వాటర్ టెస్టే హైలైట్‌గా నిలిచింది. వందేభారత్ స్లీపర్‌లో జర్నీ ఎంత అద్భుతంగా ఉండబోతోందో ఆశ్చర్యపోయే రీతిలో ఆవిష్కరించింది. దీంతో, ఈ వీడియో జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది. తెగ వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి:
జీవితం అంటే ఇదే.. 12 సార్లు సివిల్స్ పరీక్షకు ప్రయత్నించి..
వామ్మో ఐఫోన్.. తుఫానులో చిక్కుకుపోయి.. 3 రోజుల తరువాత చూస్తే..