Share News

iphone 17 survives typhoon: వామ్మో ఐఫోన్.. తుపానులో చిక్కుకుపోయి.. 3 రోజుల తరువాత చూస్తే..

ABN , Publish Date - Nov 12 , 2025 | 04:21 PM

తుపాను కారణంగా మూడు రోజుల పాటు బురదలో కూరుకుపోయినా కూడా ఓ ఐఫోన్ చెక్కు చెదరకుండా ఉన్న వైనం ప్రస్తుతం నెట్టింట ట్రెండవుతోంది. ఫిలిప్పీన్స్‌లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. ఐఫోన్ ఓనర్ స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నారు.

iphone 17 survives typhoon: వామ్మో ఐఫోన్.. తుపానులో చిక్కుకుపోయి.. 3 రోజుల తరువాత చూస్తే..
iPhone survives typhoon

ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్ నాణ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, తుపాన్‌ను కూడా తట్టుకుని చెక్కు చెదరకుండా నిలిచిన ఓ ఐఫోన్ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఇది ప్రస్తుతం జనాలు షాకయిపోయేలా చేస్తోంది (iPhone Survives Typhoon).

ఫిలిప్పీన్స్‌లో ఇటీవల కాల్మెగీ తుపాను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు, వరదల కారణంగా పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ తుపాన్ కారణంగా తానూ మరణం అంచుల వరకూ వెళ్లి వచ్చానని ఓ ఫిలిప్పీన్స్ వాసి రెడిట్‌లో చెప్పుకొచ్చారు. ఈ విపత్తుకు తన ఇల్లు మొత్తం నాశనమైనా ఐఫోన్ మాత్రం చెక్కుచెదరకుండా నిక్షేపంగా ఉందని తెగ ఆశ్చర్యపోయాడు (Philippines Viral Incident).


Iphone2.jpgఇల్లు మొత్తం కూలిపోవడంతో తన ఐఫోన్ మూడు రోజుల పాటు బురదలో కూరుకుపోయిందని సదరు వ్యక్తి తెలిపాడు. ‘వరద నీరు ఇంటి పైకప్పు వరకూ వచ్చేసింది. నేను ఇంటి టాపుపై నిలబడ్డా. చివరకు వరద ఉధృతి ఎక్కువగా ఉండటంలో నీటిలో పడిపోయా. 15 నిమిషాల పాటు ప్రాణాల కోసం పోరాటం చేసి బయటపడ్డా. ఈ క్రమంలోనే జేబులోని ఐఫోన్ నీటిలో జారిపోయింది. అప్పటికే నాకు దెబ్బతగిలి ఉండటంతో ఫోన్‌ను గురించి వెతకలేదు. ఆ తరువాత మూడు రోజుల తరువాత ఐఫోన్ నాకు బురదలో కూరుకుపోయి కనిపించింది. ఆ తరువాత దాన్ని బయటకు తీశా. కాసేపు ఆరబెట్టాక చార్జి చేస్తే ఫోన్ వెంటనే ఆన్ అయ్యింది. ఫోన్‌పై చిన్న గీత కూడా పడలేదు’ అంటూ అతడు తన ఐఫోన్ 17 ఫోన్ ఫొటోలను కూడా షేర్ చేశాడు (Typhoon Kalmaegi).

ఇక ఈ పోస్టు నెట్టింట వైరల్ కావడంతో జనాలు కూడా ఆశ్చర్యపోయారు. ఆధునిక ఫోన్లు నీటిలో తడిసి పాడు కాకుండా పక్కాగా డిజైన్ చేస్తున్నారని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ‘నీ ఫోన్‌తో పాటు నువ్వు కూడా బతికే ఉన్నందుకు కంగ్రాట్స్ బ్రో..’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ఇలా రకరకాల వ్యాఖ్యల మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


ఇవీ చదవండి:

చిన్నారుల కోసం ప్రత్యేక కారును ఆవిష్కరించిన టొయోటా! చూస్తే మతిపోవాల్సిందే!

ఢిల్లీ పరిస్థితి మరీ ఇంత దారుణమా.. విమానం నుంచి కిందకు చూస్తే..

Read Latest and Viral News

Updated Date - Nov 12 , 2025 | 05:07 PM