Woman with husband and lover: 15 రోజులు భర్తతో.. 15 రోజులు ప్రియుడితో.. పంచాయితీకి షాకిచ్చిన మహిళ..
ABN , Publish Date - Aug 27 , 2025 | 07:58 PM
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ గ్రామ పంచాయితీ సభ్యులకు షాకిచ్చింది. వివాహిత అయిన ఆ మహిళ మరో వ్యక్తితో ప్రేమలో పడింది. ఇప్పటివరకు పదిసార్లు భర్తను వదిలి ప్రియుడితో పారిపోయింది. అన్నిసార్లూ వెతికి ఆమెను వెనక్కి తీసుకొచ్చారు. ఇక, చివరకు ఆమెను గ్రామ పెద్దలు పంచాయితీకి పిలిపించారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ గ్రామ పంచాయితీ సభ్యులకు షాకిచ్చింది. వివాహిత అయిన ఆ మహిళ మరో వ్యక్తితో ప్రేమలో పడింది. ఇప్పటివరకు పదిసార్లు భర్తను వదిలి ప్రియుడితో పారిపోయింది. అన్నిసార్లూ వెతికి ఆమెను వెనక్కి తీసుకొచ్చారు. ఇక, చివరకు ఆమెను గ్రామ పెద్దలు పంచాయితీకి పిలిపించారు (UP panchayat drama). ఆమెకు బుద్ధి చెబుదామనుకుంటే, అక్కడున్న వారిందరికీ ఆమె షాకచ్చింది. ఆ ఘటన చర్చనీయాంశంగా మారింది (UP woman elopes 10 times).
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాకు చెందిన ఒక మహిళకు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఆమె వేరే వ్యక్తితో ప్రేమలో పడింది. ఏడాది సమయంలోనే ఆమె అతడితో పదిసార్లు వెళ్లిపోయింది. అన్నిసార్లూ కుటుంబ సభ్యులు ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పరిష్కరించడానికి పంచాయితీ పెట్టారు. అక్కడ ఆ మహిళ తన షాకింగ్ నిర్ణయాన్ని ధైర్యంగా వెల్లడించింది. తనను నెలలో 15 రోజులు ప్రియుడితో ఉండడానికి అనుమతిస్తేనే మిగతా 15 రోజులు భర్తతో కాపురం చేస్తానని తేల్చి చెప్పింది (woman splits time with lover).
ఆ మహిళ నిర్ణయం విన్న భర్త, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు షాకయ్యారు (bizarre love triangle). ఆమెకు సర్ది చెప్పేందుకు గ్రామపెద్దలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆమె తన ప్రియుడిని పూర్తిగా వదిలేసేందుకు అంగీకరించలేదు. చివరకు ఆమె భర్త కన్నీళ్లు పెట్టుకుంటూ.. ప్రియుడితోనే ఉండమని ఆమెను వదిలేశాడు.
ఇవి కూడా చదవండి..
ఈ పాము చాలా సంస్కారవంతమైనది.. మొబైల్‌లో అశ్లీల పాట చూసి ఏం చేసిందంటే..
రూ.100 పెట్టి షేర్ కొంటే.. రూ.3000 భోజనం ఫ్రీ.. ఆ రోజులు పోయాయంటే సీఏ ఆసక్తికర పోస్ట్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..