UP Bride Disappears: పెళ్లిలో వధువు మైమరిచిపోయి డ్యాన్స్.. మరుసటి రోజు ఆమె చేసిన పనికి..
ABN , Publish Date - Nov 20 , 2025 | 07:32 PM
యూపీలో ఓ వధువు వరుడికి ఊహించని షాక్ ఇచ్చింది. పెళ్లిలో ఆనందంతో ఫుల్లుగా డ్యాన్స్ చేసిన ఆమె ఆ రాత్రే కనిపించకుండా పోయింది. ఆమె తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. వధువు జాడ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో ఓ వధువు వరుడికి భారీ షాకిచ్చింది. పెళ్లిలో మైమరిచిపోయి డ్యాన్స్ చేసిన ఆమె తెల్లారేసరికి కనిపించకుండా పోయింది. ఆమె తన ప్రియుడితో వెళ్లిపోయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బారాబంకీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది (UP Bride Disappears after Wedding)
స్థానిక మీడియా కథనాల ప్రకారం, పల్లవి, సునీల్ కుమార్‌ల వివాహం మూడు నెలల క్రితం ఖరారైంది. మంగళవారం వారి పెళ్లి. వరుడు 90 మంది బంధువులతో కలిసి బారాబంకీలోని వధువు ఇంటికి ఊరేగింపుగా వెళ్లాడు. పెళ్లి తంతు యథావిధిగా జరిగింది. వధూవరులు దండలు మార్చుకున్నారు. జయమాల కార్యక్రమం సందర్భంగా వధువు వరుడి ముందే ఫుల్లుగా డ్యాన్స్ చేసింది. వధూవరుల ఆనందం చూసి కుటుంబసభ్యులందరూ సంతోషించారు. వారు కలకాలం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవించారు (Barabanki Viral Video).
మరుసటి రోజు వధువు వరుడితో కలిసి అత్తవారింటికి వెళ్లాల్సి ఉంది. ఇక పెళ్లి హడావుడితో బాగా అలసిపోయిన బంధువులు స్నేహితులు ఆ రాత్రి ఆదమరిచి నిద్రపోయారు. బుధవారం అప్పగింతల కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వధువు తన గదిలో లేదన్న వార్తతో ఆమె కుటుంబం కలవరపడింది. చుట్టుపక్కల అంతా వెతికినా ఆమె జాడ కనిపించలేదు. మధ్యాహ్నం వరకూ ఇరు కుటుంబాలు ఆమె కోసం పలు చోట్ల గాలించాయి.
వధువు ఆచూకీని తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చివరకు వరుడు తన కుటుంబంతో కలిసి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తరువాత వధువు కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వధువు తన లవర్‌తో వెళ్లిపోయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పెళ్లి వేడుక తరువాత అందరూ ఆదమరిచి నిద్రపోతున్న తరుణంలో వెళ్లిపోవాలని ఆమె ప్లాన్ చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వధువు మొబైల్ ఫోన్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆమె జాడ కనుక్కునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చదవండి:
బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ
దాదాపుగా సీలింగ్ ఫ్యాన్స్ అన్నిటికీ మూడే బ్లేడ్స్.. ఇలా ఎందుకంటే..