Share News

UK Vlogger Indore Visit: ఈ భారతీయ నగరాన్ని చూసి యూకే వ్లాగర్ షాక్.. ఇది సింగపూర్‌లా ఉందంటూ కామెంట్

ABN , Publish Date - May 02 , 2025 | 05:31 PM

భారత్‌లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరుపొందిన ఇండోర్‌లో పర్యటించిన ఓ యూకే వ్లాగర్ అక్కడి పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు. అక్కడి పరిసరాలు సింగపూర్‌ను తలపిస్తున్నాయంటూ కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

UK Vlogger Indore Visit: ఈ భారతీయ నగరాన్ని చూసి యూకే వ్లాగర్ షాక్.. ఇది సింగపూర్‌లా ఉందంటూ కామెంట్
UK Vlogger Indore Visit

ఇంటర్నెట్ డెస్క్: భారత్ అంటే చాలా మంది విదేశీయులకు అపరిశుభ్ర వాతావరణమే గుర్తొస్తుంది. అయితే, ఇటీవల ఇండోర్ నగరానికి వచ్చిన ఓ బ్రిటన్ వ్లాగర్ అక్కడి వాతావరణాన్ని చూసి షాకైపోయాడు. ఇది ఇండియానా సింగపూరా అంటూ నోరెళ్లబెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.

‘‘ ఈ నగరం చరిత్ర తెలీకుండానే ఇక్కడ పర్యటించేందుకు నిర్ణయించుకున్నా. భారత్‌లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఇండోర్‌కు పేరు ఉన్న విషయం నాకు తెలియదు. గత ఏడు సంవత్సరాలుగా ఇండోర్‌కు ఈ గుర్తింపు కొనసాగుతోందట. ఇక్కడి పరిస్థితి చూస్తే నిజంగానే ఆశ్చర్యం వేస్తోంది. రోడ్‌లపై ఎక్కడా చెత్తాచెదారం లేదు. ఇది ఓ భారతీయ నగరం అంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. పరిశుభ్రత విషయంలో దేశానికంతటికీ ఆదర్శంగా నిలుస్తోంది’’


‘‘ఎవరు చెత్తాచెదారం వీధుల్లో వేయకుండా 1800 సీసీటీవీ కెమెరాలతో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. ఇక్కడున్న గార్బేజ్ కేఫ్‌లో ఒక కేజీ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇచ్చి ఉచిత భోజనం పొందొచ్చు. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించే వర్కర్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది సాధారణ నగరంలా లేదు. ఓ స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళుతున్న సమాజం కనిపిస్తోంది. సుస్థిరతకు పర్యాయపదంలా నిలుస్తోంది’’ అని అన్నారు.

ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్‌ కూడా ఎంతో పరిశుభ్రంగా ఉన్నట్టు అతడు చెప్పుకొచ్చాడు. ఏ నాలుగు రోడ్ల కూడలి చూసినా పరిశుభ్రంగా కనిపించిందని అన్నాడు. భారతీయ నగరాలు సాధారణంగా ఇలా ఉండవని చెప్పాడు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేలా ప్రజల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోందని కూడా తెలిపాడు.


ఇక ఈ వీడియోకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇది నిజంగా సింగపూర్ లాగానే ఉందని అనేక మంది కామెంట్ చేశారు. మా ఇండోర్ నగరానికి స్వాగతం మిత్రమా.. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మేము ఎంతో పాటుపడతాము అని స్థానికుడు ఒకరు కామెంట్ చేశారు. కచ్చితంగా ఇండోర్‌ను సందర్శించి వస్తా అని మరో వ్యక్తి తెలిపారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం నెట్టింట ట్రెండవుతోంది. మరి ఈ ఆసక్తికర వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి:

సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలపై పాక్ ప్రజలు ఏమంటున్నారంటే..

మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..

అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు

Read Latest and Viral News

Updated Date - May 02 , 2025 | 05:38 PM