Share News

Teacher Beaten Student: దారుణం.. వికలాంగ విద్యార్థిపై కారం చల్లి.. పైపుతో కొట్టిన ఉపాధ్యాయుడు

ABN , Publish Date - Dec 21 , 2025 | 08:31 AM

నేటి సమాజంలో మనిషి తోటి మనిషిలోని బాధను గుర్తించే మనసు కోల్పోతున్నాడు. సైకోల్లా ప్రవర్తిస్తు.. ఎదుటి వారిపై దాడులకు పాల్పపడుతున్నారు. ఒక వికలాంగ విద్యార్థిపై కారం చల్లి, కాలితో తన్నుతూ.. ప్లాస్టిక్ పైప్‌తో కొట్టిన అమానవీయ ఘటన ప్రతిఒక్కరి హృదయాలను కదిలిస్తుంది.

Teacher Beaten Student: దారుణం.. వికలాంగ విద్యార్థిపై కారం చల్లి.. పైపుతో కొట్టిన ఉపాధ్యాయుడు
Teacher Arrested for Student Abuse

ఈ మధ్య కాలంలో కొంతమంది మానవత్వం మరిచి, విచక్షణ కోల్పోయి సైకోలుగా మారుతూ ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే రోజు రోజుకీ సమాజంలో మానవత్వం పూర్తిగా చచ్చిపోతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఒక వికాలాంగుడైన విద్యార్థిపై ఉపాధ్యాయుడు కారం (Chili powder)చల్లి, ప్లాస్టీక్ పైప్‌(Plastic pipe)తో కొడుతూ, కాలితో తన్నుతూ దాడికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన కర్ణాటక(Karnataka)లోని బాగల్‌కోట్ జిల్లా (Bagalkot District)లో చోటు చేసుకుంది.


ఉత్తర కర్ణాటకలోని నవగర్ (Navagar Area) ప్రాంతంలోని ప్రత్యేక అవసరాల గల పిల్లల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూల్ (Residential school) లో 16 ఏళ్ల ఓ వికాలాంగ విద్యార్థి (Disabled student)పై విచక్షణారహితంగా దాడి జరిగింది. దాడికి పాల్పపడింది అక్షయ్ ఇందుల్కర్ అనే ఉపాధ్యాయుడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral video) అవుతుంది. వీడియోలో ఉన్నట్లు పిల్లలు నేలపై కూర్చున్నారు, అక్షయ్ ఇందుల్కర్ ఓ విద్యార్ధిని ప్లాస్టిక్ పైప్‌తో కొడుతూ, కాలితో తన్నుతున్నాడు. ఆ విద్యార్థి బాధతో విలవిలలాడిపోతున్నాడు. కొంతమంది పక్కన ఉన్నవాళ్లు నవ్వుతున్నారు. అదే సమయానికి అక్షయ్ భార్య కూడా అక్కడికి వచ్చినప్పటికీ ఈ దారుణాన్ని ఆపలేదు. దీనికి సంబంధించిన వీడియో ఆ సంస్థ మాజీ ఉద్యోగి (Former employee) లీక్ చేసినట్లు తెలుస్తుంది.


ఈ ఘటనపై సదరు విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్షయ్ అతని భార్యతో పాటు మరికొంత మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవీ చదవండి:

పరువు పోగొట్టుకుంటున్న పాక్.. సౌదీలో 56 వేల మంది పాక్ యాచకుల బహిష్కరణ

ఐఎమ్ఎఫ్‌తో చిక్కులు.. అధిక కండోమ్స్ ధరలతో పాక్‌ సతమతం

Updated Date - Dec 21 , 2025 | 10:08 AM