Shocking: వామ్మో.. షాప్‌లో ఐస్ క్రీమ్ కొన్న వ్యక్తి.. తిందామని చూస్తే దిమ్మదిరిగిపోయే షాక్..
ABN , Publish Date - Mar 07 , 2025 | 07:26 PM
ఐస్ ఫ్రూట్‌ల తయారీలో పరిశుభ్రత పాటించరని, చాలా అపరిశుభ్రంగా వాటిని తయారు చేస్తారని సోషల్ మీడియా ద్వారా ఎన్నో వీడియోలు సాక్ష్యాలతో సహా వచ్చాయి. అయితే థాయ్‌లాండ్‌లోని ఓ వ్యక్తి ఐస్ ఫ్రూట్ కొని దిమ్మదిరిగే షాక్ తిన్నాడు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఐస్‌క్రీమ్ (Ice cream) లేదా ఐస్ ఫ్రూట్‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు.. పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా వాటిని తింటుంటారు. అయితే ఐస్ ఫ్రూట్‌ల తయారీలో పరిశుభ్రత పాటించరని, చాలా అపరిశుభ్రంగా వాటిని తయారు చేస్తారని సోషల్ మీడియా ద్వారా ఎన్నో వీడియోలు సాక్ష్యాలతో సహా వచ్చాయి. అయితే థాయ్‌లాండ్ (Thailand)లోని ఓ వ్యక్తి ఐస్ ఫ్రూట్ కొని దిమ్మదిరిగే షాక్ తిన్నాడు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలను చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.
థాయిలాండ్‌లోని మువాంగ్ రట్చాబురి ప్రాంతానికి చెందిన రెబాన్ నక్లియాంగ్‌బూన్ అనే వ్యక్తి ఓ షాప్‌లో బ్లాక్ బూన్ (Black bean) ఐస్ ఫ్రూట్ కొన్నాడు. బ్లాక్ బీన్ అనేది థాయిలాండ్‌లో ఒక రకమైన ఐస్ క్రీం. దీనిని అక్కడి ప్రజలు ఎక్కువగా తింటారు. ఆ బ్లాక్ బూన్ ఐస్ ఫ్రూట్‌ను రెబాన్ కొన్నాడు. అయితే గడ్డ కట్టిన ఆ ఐస్‌ఫ్రూట్‌లో ఓ చిన్న పాము కనిపించడంతో ఖంగు తిన్నాడు. నలుపు, పసుపు రంగులో ఉన్న ఆ పామును గోల్డెన్ ట్రీ స్నేక్ అంటారు. ఆ పాము సాధారణంగా 70 నుంచి130 సెం.మీ వరకు పెరుగుతుంది. అయితే ఐస్ క్రీంలో కనిపించిన పాము 20 నుంచి 40 సెం.మీ పొడవు మాత్రమే ఉంది. అది ఆ పాము పిల్ల అయి ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. (snake was found inside an ice cream)
ఆ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దానిని చూసిన నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. మీకు ఐస్‌క్రీమ్‌తో పాటు అదనంగా ప్రోటీన్ లభిస్తోందని ఒకరు కామెంట్ చేశారు. వీధి వ్యాపారుల దగ్గర కొని తినే ముందు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని మరొకరు సూచించారు. ఫర్వాలేదు.. ఆ పాము చనిపోయి ఉంటుందని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Shocking Video: నీ చేతులతో చేసిన టీ కావాలని అడిగిన భర్త.. భార్య చేసిన పనికి వాంతులు రావడం ఖాయం..
Optical Illusion: మీ కళ్లు నిజంగా పవర్‌ఫుల్ అయితే.. ఈ కొంగల మధ్యనున్న అమ్మాయి మొహాన్ని కనుక్కోండి..
Pakistan Viral Video: వీళ్లను చూశారా? ఎంత ట్యాలెంటెడ్‌గా ఉన్నారో.. బైక్‌ను రిక్షాలా మార్చేశారు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేేయండి..