Share News

Shocking Video: నీ చేతులతో చేసిన టీ కావాలని అడిగిన భర్త.. భార్య చేసిన పనికి వాంతులు రావడం ఖాయం..

ABN , Publish Date - Mar 07 , 2025 | 05:26 PM

బయట టీ స్టాల్స్‌లో శుభ్రత ఉండదని చాలా మంది ఇంటి దగ్గరే టీ, కాఫీ తాగుతుంటారు. అలాగే ఓ భర్త తన భార్యను టీ అడిగాడు. స్వయంగా నీ చేతులతో చేసి తీసుకురా అన్నాడు. ఆ మాటలను సీరియస్‌గా తీసుకున్న భార్య టీ చేసిన విధానం చూస్తే దిమ్మదిరిగి పోవాల్సిందే.

Shocking Video: నీ చేతులతో చేసిన టీ కావాలని అడిగిన భర్త.. భార్య చేసిన పనికి వాంతులు రావడం ఖాయం..
Wife prepares tea with her hands

సాధారణంగా రోజంతా ఆఫీస్‌లో కష్టపడిన మగవాళ్లు ఇంటికి వచ్చాక భార్యను టీ (Tea) లేదా కాఫీ పెట్టి ఇవ్వమని అడుగుతుంటారు. భర్త (Husband) కోరిక మేరకు భార్య (Wife) చాలా శుభ్రంగా టీ చేసి ఇస్తుంటుంది. బయట టీ స్టాల్స్‌లో శుభ్రత ఉండదని చాలా మంది ఇంటి దగ్గరే టీ, కాఫీ తాగుతుంటారు. అలాగే ఓ భర్త తన భార్యను టీ అడిగాడు. స్వయంగా నీ చేతులతో చేసి తీసుకురా అన్నాడు. ఆ మాటలను సీరియస్‌గా తీసుకున్న భార్య టీ చేసిన విధానం చూస్తే దిమ్మదిరిగి పోవాల్సిందే. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Wife prepares tea with her hands).


sidra.riaz.vlogs అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియోను (Viral Video) షేర్ చేశారు. స్వయంగా నీ చేతులతో చేసిన టీ తీసుకురా అని భర్త అడిగినపుడు అంటూ ఆ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ గ్యాస్ స్టవ్ మీద టీ కోసం గిన్నె పెట్టింది. ముందుగా టీ పౌడర్‌ను తన చేతిలోకి తీసుకుని వేసింది. అలాగే పంచదారను కూడా చేతి నుంచి గిన్నెలో పడేలా వేసింది. ఆ తర్వాత పాలను కూడా తన చేతిపై వేసుకుని గిన్నెలో పడేలా చేసింది. చివరకు తన చేతులతోనే ఆ టీని వడకట్టింది. ఈ పనులన్నింటికీ ఆమె తన ఎడమ చేతిని వాడింది. ఆ వీడియో చూసిన వారు అవాక్కవుతున్నారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 4 లక్షల మంది వీక్షించారు. 25 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. నాకు మాత్రం ఇలాంటి భార్య వద్దు అంటూ ఒకరు కామెంట్ చేశారు. ఆ టీ తాగిన భర్త బాత్రూమ్‌కు పరిగెత్తాల్సిందే అంటూ మరకొరు పేర్కొన్నారు. భర్త మాటలను మరీ అంత సీరియస్‌గా తీసుకోకూడదని మరొకరు అన్నారు.


ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ కళ్లు నిజంగా పవర్‌ఫుల్ అయితే.. ఈ కొంగల మధ్యనున్న అమ్మాయి మొహాన్ని కనుక్కోండి..


Pakistan Viral Video: వీళ్లను చూశారా? ఎంత ట్యాలెంటెడ్‌గా ఉన్నారో.. బైక్‌ను రిక్షాలా మార్చేశారు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేేయండి..

Updated Date - Mar 07 , 2025 | 05:26 PM