Share News

Viral Video: తృటిలో తప్పిన ప్రమాదం.. మెట్రోలో యువతికి షాక్.. ఎంతకీ ఏమైందంటే?

ABN , Publish Date - Oct 16 , 2025 | 08:20 AM

మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ యువతికి దిమ్మతిరిగే ఘటన ఎదురైంది. ఎంతో ఏమరపాటుగా చెవిలో హెడ్ ఫోన్స్ ధరించి ఓ యువతి ట్రైన్ కోసం ఎదురుచూస్తుంది. రైలు మెట్రో స్టేషన్ కు వస్తున్నది గమనించకుండానే మెట్రో లైన్ దాటి ట్రాక్ మీదికి వెళ్లే ప్రయత్నం చేసింది. ఒక్క క్షణమైతే వేగంగా వస్తున్న ట్రైన్ ఆమెను ఢీ కొట్టేది. అయితే విధి నిర్వహణలో భాగంగా వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డు క్షణంలో అప్రమత్తమయ్యారు.

Viral Video: తృటిలో తప్పిన ప్రమాదం.. మెట్రోలో యువతికి షాక్.. ఎంతకీ ఏమైందంటే?
Viral Video

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 16: మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ యువతికి తృటిలో ప్రమాదం తప్పింది. అజాగ్రత్తగా ఉన్న ఆ యువతి చూసుకోకుండా వేగంగా వస్తున్న మెట్రో రైలుకి అడ్డుగా వెళ్ళింది. వెంటనే అక్కడి ఓ వ్యక్తి అడ్డుకోవడంతో క్షణంలో జరిగే ప్రమాదం జరిగింది. ఇదంతా కేవలం ఒక్క సెకన్లోనే జరిగింది. అయితే యువతికి మెట్రో సౌండ్ ని గుర్తించలేదు. ఎందుకంటే ఆమె చెవిలో హెడ్ ఫోన్స్ ధరించి చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూసుకోకుండా ఆదమరిచి అజాగ్రత్తగా వ్యవహరించింది. క్షణాల్లో పోయే ఆమె ప్రాణాలను ఓ వ్యక్తి అప్రమత్తమై ఆమెను కాపాడారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అమ్మాయిని అక్కడున్న వ్యక్తి కాపాడక పోయి ఉంటే ఏమయ్యుండేది అని ఆశ్చర్యానికి గురవుతున్నారు.


మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ యువతికి దిమ్మతిరిగే ఘటన ఎదురైంది. ఎంతో ఏమరపాటుగా చెవిలో హెడ్ ఫోన్స్ ధరించి ఓ యువతి ట్రైన్ కోసం ఎదురుచూస్తుంది. రైలు మెట్రో స్టేషన్ కు వస్తున్నది గమనించకుండానే మెట్రో లైన్ దాటి ట్రాక్ పైకి వెళ్లే ప్రయత్నం చేసింది. ఒక్క క్షణమైతే వేగంగా వస్తున్న ట్రైన్ ఆమెను ఢీ కొట్టేది. అయితే విధి నిర్వహణలో భాగంగా వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డు క్షణంలో అప్రమత్తమయ్యారు. రైలు రాకను గమనించి వెంటనే ఆ అమ్మాయిని తన చేతిని పట్టుకొని వెనుకకు లాగారు. షాక్ కు గురైన యువతి మెట్రో వెళ్లడాన్ని గమనించి నిర్గాంతపోయింది. తనను కాపాడకపోయుంటే జరగరానిది జరిగేది అని తీవ్ర విస్మయానికి గురైంది. తనను కాపాడినందుకు సెక్యూరిటీ గార్డుకు ధన్యవాదాలు తెలిపింది. క్షణాల్లో అప్రమత్తమై సెక్యూరిటీగార్డు కాపాడటాన్ని అందరూ కొనియాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Transgenders Hospitalized in Delhi: ఫినాయిల్ తాగిన 25 మంది ట్రాన్స్‌జెండర్లు

The Central Government Informed: రక్షణ భూముల స్వాధీనానికి మార్గదర్శకాలు ఇవ్వండి

Updated Date - Oct 16 , 2025 | 08:20 AM