Share News

Viral Video: ఈ వీడియో చూస్తే పడిపడి నవ్వాల్సిందే.. అస్సలు మిస్ అవ్వకండి..!

ABN , Publish Date - Nov 07 , 2025 | 06:36 PM

హాలోవీన్స్.. ఐరాపా దేశాల్లో మాత్రమే నిర్వహించుకునే ఈ సెలబ్రేషన్స్ క్రమేపీ ప్రపంచమంతా విస్తరించాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే.. ఈ సంవత్సరం కూడా హాలోవీన్స్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు..

Viral Video: ఈ వీడియో చూస్తే పడిపడి నవ్వాల్సిందే.. అస్సలు మిస్ అవ్వకండి..!
Viral Video

Watch Video: హాలోవీన్స్.. ఐరాపా దేశాల్లో మాత్రమే నిర్వహించుకునే ఈ సెలబ్రేషన్స్ క్రమేపీ ప్రపంచమంతా విస్తరించాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే.. ఈ సంవత్సరం కూడా హాలోవీన్స్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు ఆయా దేశాల ప్రజలు. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే, హాలోవీన్స్ డే రోజున రాత్రి సమయంలో కొందరు తమ తమ ఇళ్ల వద్ద హాలోవీన్స్ వేషధారణలో రిమోట్ కంట్రోల్డ్ బొమ్మలను ఏర్పాటు చేస్తుంటారు. ఈ బొమ్మలే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన రచ్చ చేస్తున్నాయి. రాత్రి సమయంలో ఇళ్ల పరిసరాల్లో తిరిగే జంతువులకు ఈ హాలోవీన్స్ బిగ్ షాక్ ఇస్తున్నాయి. వీటికి సంబంధించిన వీడియోస్ చూసి నెటిజన్లు సైతం ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి ఎక్స్‌లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం..


వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఇంటి ఆవరణలో హాలోవీన్స్ రూపంలో ఉన్న రిమోట్ కంట్రోల్డ్ బొమ్మను ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో ఆ ఇంటి ఆవరణలోకి భారీ ఎలుగుబంటి ఒకటి వచ్చింది. సరిగ్గా ఆ బొమ్మ వద్దకు వచ్చి నిల్చుంది. మనిషి మాదిరిగా నిల్చుని ఉండటంతో వాసన పడిగడుతూ.. ఆ బొమ్మను తెరిపారా చూడసాగింది ఎలుగుబంటి. ఇంతలో బొమ్మకు లైట్ వెలిగి గట్టిగా శబ్ధం చేసింది. దీంతో బెదిరిపోయిన ఎలుగుబంటి.. షాక్‌తో పక్కకు ఎగిరిపడింది. కాసేపటికి తేరుకున్న ఎలుగుబంటి.. ఆ బొమ్మను నెట్టిపడేసింది.


ఈ సీన్ అంతా ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఎలుగుబంటి బెదిరిపోయిన విధానం చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు పాజిటివ్‌గా కామెంట్స్ పెడితే.. మరికొందరు నెగెటీవ్‌గా కామెంట్స్ పెడుతున్నారు.


నిజమైనదా? ఏఐ వీడియోనా ?

అయితే, ఈ వీడియోపై నెటిజన్లు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమైన వీడియోనా.. లేక ఏఐ వీడియోనా అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సదరు పోస్టులో కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇది నిజమైన వీడియోనా.. ఏఐ ఆధారంగా క్రియేట్ చేసిన వీడియోనో గానీ.. మొత్తానికి నెటిజన్లకు మాత్రం ఫుల్ ఫన్ ఇస్తోంది. మరెందుకు ఆలస్యం.. వీడియోను మీరూ చూసేయండి.

Updated Date - Nov 07 , 2025 | 06:52 PM