School Principal Cheque: చెక్కులో దారుణ అక్షర దోషాలు.. ప్రిన్సిపాల్ నిర్వాకానికి జనాలు షాక్
ABN , Publish Date - Sep 30 , 2025 | 06:19 PM
భయంకరమైన అక్షర దోషాలు ఉన్న చెక్‌ను రాసిచ్చిన ఓ ప్రిన్సిపాల్ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. జనాలు షాకయ్యేలా చేస్తోంది
ఇంటర్నెట్ డెస్క్: విద్యార్థుల తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. మంచి చెడుల మధ్య తేడాను చెప్పి పిల్లలు సక్రమ మార్గంలో వెళ్లేలా మార్గనిర్దేశనం చేయాలి. ఇంతటి గురుతర బాధ్యత నిర్వహించే టీచర్.. అందునా ప్రభుత్వ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌గా ఉన్న వ్యక్తికి సాధారణ పదాల స్పెల్లింగ్ కూడా తెలియదంటే ఎవరైనా గుండెలు బాదుకుంటారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో సరిగ్గా ఇదే ఘటన వెలుగు చూసింది. నెట్టింట ఇది కలకలం రేపుతోంది.
సిర్మోర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన ఫొటో తెగ వైరల్ అవుతోంది. సింగ్ అనే వ్యక్తి పేరిట ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ రూ. 7,616లకు చెక్కు రాసిచ్చారు. అయితే. ఈ డబ్బును అక్షరాల్లో రాసేటప్పుడు దారుణమైన తప్పులు దొర్లడంతో బ్యాంకు చెక్కును రిజెక్ట్ చేసింది. దీంతో, స్థానికంగా కలకలం రేగింది.
ఒకటో తరగతి విద్యార్థి వలెనే సదరు ప్రిన్సిపాల్ దారుణంగా తప్పులు చేశారు. ఎవ్వరూ ఊహించలేని అక్షర దోషాలకు దిగారు. సెవెన్ (Seven) అని రాసే బదులు సావెన్ (Saven) అని రాసుకొచ్చారు. హండ్రెడ్ (Hundred) అని రాసే బదులు హరేంద్ర (Harendra) అన్ని రాసుకొచ్చారు. చివరకు సిక్స్‌టీన్ అన్న పదానికి బదులు సిక్స్టీ అని రాశారు.
ఈ చెక్కు ఫొటో నెట్టింట వైరల్ కావడంతో జనాలు షాకైపోతున్నారు. ప్రిన్సిపాల్‌గా ఉన్న వ్యక్తి ఇన్ని తప్పులతో చెక్కు రాశారంటే నమ్మలేక పోతున్నామని అన్నారు. ఇతరులెవరైనా నింపిన చెక్కుపై ప్రిన్సిపాల్ సంతకం పెట్టి ఉంటారని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. మరి సంతకం చేసేటప్పుడైనా చెక్కును ప్రన్సిపాల్ ఎందుకు క్షుణ్ణంగా పరిశీలించలేదని మరికొందరు లాజిక్‌ను లేవనెత్తారు. ఇలాంటి ప్రిన్సిపాల్స్‌ను, టీచర్‌లను విదేశీ టూర్లకు పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కొందరు హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
ఆ ఫైర్ లేదంటూ ఊస్టింగ్.. భారతీయురాలికి షాకిచ్చిన జర్మన్ కంపెనీ
3 సార్లు హెచ్-1బీ వీసాలో నిరాశ.. పంతం పట్టి కల నెరవేర్చుకున్న యువకుడు