Share News

Pratyekam : ఉన్న డబ్బులు సరిపోవు.. అందులోనూ అప్పులు.. శాండ్విచ్ జనరేషన్‌ బ్యాచ్ ఇబ్బందులు!

ABN , Publish Date - Feb 24 , 2025 | 08:47 PM

Sandwich Generation's finance woes : శాండ్విచ్ జెనరేషన్ అంటే 35-54 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు. ఈ వయసు వారే ఎక్కువగా సంపాదన విషయంలో ఇబ్బందులు పడుతున్నారంట. వచ్చే ఆదాయం సరిపోక అందినకాడికి అప్పులు చేసేస్తూ కుటుంబ భారాన్ని ఈడ్చలేక బాధ్యతలు, పనుల ఒత్తిడి నడుమ నలిగిపోతున్నారు.

Pratyekam : ఉన్న డబ్బులు సరిపోవు.. అందులోనూ అప్పులు.. శాండ్విచ్ జనరేషన్‌ బ్యాచ్ ఇబ్బందులు!
Sandwich Generation Financial Challenges

శాండ్విచ్ జెనరేషన్ అంటే 35-54 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు. వీరు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆదా చేయాలి, చదువుకు ఖర్చు పెట్టాలి. మరోవైపు తల్లిదండ్రుల వైద్యం, జీవన వ్యయాలు చూసుకోవాలి. ఈ మధ్య తరానికి జీవిత ఖర్చులు, సంపాదనపై చాలా ఒత్తిడి ఉంటుంది. ఇండియాలో ఈ తరానికి సంబంధించిన 4,000 మందిని Edelweiss Life Insurance, YouGov సంస్థలు కలిసి సర్వే చేశాయి. సర్వే ప్రకారం, 60శాతం మంది భవిష్యత్తు ఆర్థిక భద్రత గురించి భయపడుతున్నారు. ఎంత ఆదా చేసినా, ఎంత పెట్టుబడి పెట్టినా, భవిష్యత్తు కోసం సరిపోదని భావిస్తున్నారు. 50శాతం మందికి "మన దగ్గర ఉన్న డబ్బు ఎప్పుడైనా అయిపోతుందేమో" అనే ఆందోళన ఉంది.


ఈ తరం ఎక్కువగా క్రెడిట్ కార్డులు, లోన్లు తీసుకోవడం, ఖర్చులు తట్టుకోవడం కోసం పెట్టుబడులను ముందే ఉపసంహరించుకోవడం చేస్తోంది. ముఖ్యంగా వైద్యం కోసం పొదుపులను ముందుగానే వినియోగించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. పిల్లల విద్య ఖర్చులు, తల్లిదండ్రుల ఆరోగ్య వ్యయం, పని,వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కొరత.. ఇవన్నీ వీరి ప్రధాన ఆందోళనలు.


వారి సగటు కుటుంబ ఆదాయం రూ.1,00,000 - రూ.2,50,000 మధ్య ఉంది. అయితే డబ్బు సంపాదించినా ఆనందించలేరు. 43శాతం మంది "ఏదైనా కొంటే మనం డబ్బు వృధా చేస్తున్నామనే ఫీలింగ్ వస్తోంది" అన్నారు. భవిష్యత్తు కోసం సరిపోదేమో అనే భయం వారిలో నిత్యం ఉంటుంది. ఈ ఆందోళన 'మనీ డిస్మార్ఫియా' అనే భావనకు దారితీస్తోంది. అంటే ఉన్న డబ్బు సరిపోదని, భవిష్యత్తులో ఇబ్బంది పడతామని అనిపించడం. దీనికి పరిష్కారం సరైన ఆర్థిక ప్రణాళిక చేసుకోవడం. ఆర్థిక సలహాదారులను సంప్రదిస్తే, వారు పొదుపు, పెట్టుబడుల కోసం సరైన మార్గాన్ని సూచిస్తారు. ఆర్థికంగా, భావోద్వేగపరంగా కలిగే ఒత్తిడిని తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది.


ఇవి కూడా చదవండి..

Pratyekam : ఒంటరి తల్లులకు పెరుగుతున్న కష్టాలు.. ఆడవారిగా పుట్టడమే పాపమా..

ఇది గుడిసె అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. లోపలికి వెళ్లి చూస్తే నివ్వెరపోవాల్సిందే..

Kulu Manali Trip : రూ.15వేల ఖర్చుతోనే.. జంటగా మనాలీ చుట్టేయండి ఇలా..

మరిన్ని ప్రత్యేక , తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 24 , 2025 | 08:49 PM