Russia Woman about India: మూడేళ్లుగా భారత్‌లో ఉంటున్న రష్యా యువతి.. అవన్నీ నిజం కాదంటూ..
ABN , Publish Date - Dec 21 , 2025 | 01:11 PM
భారత్‌పై విదేశీయుల్లో ఉన్న దురభిప్రాయాలను తొలగించేందుకు ఓ రష్యా యువతి చేసిన ప్రయత్నం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ గురించి ఎన్నో దురభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. సోషల్ మీడియాలో అనేక మంది వ్యూస్ కోసం తప్పుడు అభిప్రాయాలను వైరల్ చేస్తుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో కొందరు ఫారినర్లు ఈ తప్పుడు అభిప్రాయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోవలోనే మరో వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ రష్యా యువతి చేసిన ఈ వీడియోకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు (Russia Woman Dispels False notions about India).
క్సేనియా షకిర్‌జియొనోవా అనే యువతి ఈ వీడియోను పోస్ట్ చేశారు. భారత్ గురించి అనేక తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయని అన్నారు. ఇక్కడ మూడేళ్లుగా ఉంటున్న తాను అవన్నీ తప్పని స్వానుభవంతో తెలుసుకున్నట్టు చెప్పారు. తన అనుభవాలను సవివరంగా వీడియోలో పంచుకున్నారు.
‘ఇండియాలో ఎండలకు నల్లబడిపోతావని జనాలు నన్ను హెచ్చరించారు. అదేమీ లేదు. ఎప్పటిలాగానే ఉన్నాను. భారతీయ వంటకాల్లో నూనె ఎక్కువగా ఉంటుందని కూడా కొందరు అనుకుంటారు. లావు అవుతావని నన్ను హెచ్చరించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. రోజూ భారత్‌లో చీరలు కట్టుకోవాల్సి వస్తుందని అన్నారు. కానీ అదీ తప్పు అభిప్రాయమే. ఇంతవరకూ అలాంటి పరిస్థితే ఎదురుకాలేదు. నాలో ఆధ్యాత్మికత పెరిగిపోతుందని కూడా అన్నారు. కానీ ప్రత్యేకమైన ఫీలింగ్స్ ఏమీ లేవు. ఎప్పటిలాగానే ఉన్నాను. అన్నట్టు.. జనాలు అనుకుంటున్నట్టు నేను రోజుకు ఐదు సార్లు మసాలా టీలు కూడా తాగట్లేదు. కాబట్టి.. ఇండియా ఇండియాలాగానే ఉంది. నేను నాలాగానే ఉన్నాను’ అని అన్నారు.
ఈ వీడియోపై జనాల నుంచి సహజంగానే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. జనాలు ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ సంస్కృతి, పరిస్థితుల గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుకు అభినందించాల్సిందేనని అన్నారు. జనాల్లో ఉన్న తప్పుడు అభిప్రాయాలు తొలగించేందుకు ప్రయత్నించినందుకు కూడా ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చదవండి:
ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రాజెక్టు.. ఇల్లు అప్పగించని పౌరుడు.. చివరకు..
వాయుకాలుష్యం నుంచి తక్షణ ఉపశమనం.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో