Woman Brain Cancer: క్యాన్సర్‌తో మరణం అంచున యువతి.. మిగిలిన టైంలో ఏం చేయాలో చెప్పాలంటూ పోస్టు
ABN , Publish Date - Jul 20 , 2025 | 07:54 PM
బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా తనకు మరో తొమ్మిది నెలల్లో చావు పక్కా అంటూ ఓ యువతి నెట్టింట పోస్టు పెట్టింది. ఇప్పటివరకూ లైఫ్ అసలు ఎంజాయ్ చేయని తాను మిగిలిన సమయాన్ని ఎలా ఆస్వాదించాలో చెప్పండంటూ నెటిజన్లను అభ్యర్థించింది.
ఇంటర్నెట్ డెస్క్: బ్రెయిన్ క్యాన్సర్‌తో మరణం అంచులకు చేరుకున్న ఓ 22 ఏళ్ల యువతి తనకు మిగిలున్న సమయంలో ఏం చేయాలో చెప్పాలంటూ జనాల్ని సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించింది. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట సంచలనం రేపుతోంది. రెడిట్‌లో సదరు యువతి ఈ పోస్టు పెట్టింది.
తన బ్రెయిన్ క్యాన్సర్ బాగా ముదిరిపోయినట్టు వైద్యులు చెప్పారని సదరు యువతి పేర్కొంది. మరో 9 నెలలకు మించి తాను బతికే అవకాశాలు లేవని అన్నట్టు వెల్లడించింది. లైఫ్ ఇలాంటి మలుపు తిరుగుతుందని ఊహించని తను పైచదువుల కోసం 24 వేల డాలర్లు కూడబెట్టుకున్నట్టు తెలిపింది. తనకు భూమ్మీద మిగిలున్న కొద్ది సమయంలో ఈ డబ్బంతా ఎలా ఖర్చు చేయాలో చెప్పాలని కోరింది.
‘ఈ డబ్బును తొలుత నా తోడబుట్టిన వారికి ఇచ్చేద్దామనుకున్నా. కానీ లైఫ్‌లో నేను ఎప్పుడూ పెద్దగా ఎంజాయ్ చేసింది లేదు. కొత్త దుస్తులు కొనుగోలు చేయలేదు. మద్యం టచ్ చేయలేదు. ఎప్పుడూ పర్యటనలు చేయలేదు. కాబట్టి, ఈ చివరి క్షణాల్లో జీవితాన్ని ఆసాంతం ఆస్వాదించాలని అనుకుంటున్నా. కాబట్టి, ఈ డబ్బును ఎలా ఖర్చు చేసి ఎంజాయ్‌మెంట్ పొందొచ్చో చెప్పండి’ అని పోస్టు పెట్టింది.
ఇక ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది యువతి పరిస్థితిపై సంతాపం తెలిపారు. డబ్బు ఖర్చు చేయడంపై తమకు తోచిన సలహాలు కూడా ఇచ్చారు. కొందరు ఆ డబ్బుతో నచ్చిన ప్రదేశాలకు టూర్‌పై వెళ్లాలని అన్నారు. మరికొందరు మనసుకు నచ్చిన ప్రాజెక్టు చేపట్టాలని తెలిపారు. స్కై డైవింగ్ వంటి సాహసోపేత క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. నచ్చిన దుస్తులు వేసుకోవాలని, ఫుడ్స్ తినాలని, మ్యూజిక్ కాన్సర్ట్‌లకు వెళ్లాలని చెప్పారు. కొందురు మాత్రం తొందరపడొద్దని అన్నారు. మరో డాక్టర్ సలహా తీసుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్న అనేక మంది ఆ తరువాత చాలా ఏళ్ల పాటు జీవించిన విషయాన్ని కొందరు చెప్పారు.
ఇవీ చదవండి:
లండన్‌లోని ఇస్కాన్ రెస్టారెంట్‌లో షాకింగ్ సీన్.. వీడియో వైరల్
22 ఏళ్ల వయసులో ఒంటరిగా విదేశీ యాత్ర.. ఈ భారతీయ యువకుడి అనుభవం ఏంటో తెలిస్తే..