Share News

Indian Traveller: 22 ఏళ్ల వయసులో ఒంటరిగా విదేశీ యాత్ర.. ఈ భారతీయ యువకుడి అనుభవం ఏంటో తెలిస్తే..

ABN , Publish Date - Jul 19 , 2025 | 04:39 PM

భారతీయ పాస్‌‌పోర్టు ఉన్న వారు ఎదుర్కునే ఇక్కట్ల గురించి వివరిస్తూ ఓ యువకుడు పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. జనాలు ఈ పోస్టుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Indian Traveller: 22 ఏళ్ల వయసులో ఒంటరిగా విదేశీ యాత్ర.. ఈ భారతీయ యువకుడి అనుభవం ఏంటో తెలిస్తే..
Indian Solo Traveller

ఇంటర్నెట్ డెస్క్: సరదాగా షికారుకు వెళ్లడం ఎవరికైనా ఇష్టమే. ఇక ఇతర దేశాల్లో కొత్త ప్రదేశాలను చూడాలంటే ఎవరైనా ఎగిరి గంతేయాల్సిందే. ఇలాంటి జర్నీల్ని ఎంజాయ్ చేసే ఓ భారతీయ యువకుడు ఒంటరిగా విదేశీ యాత్రకు బయలుదేరాడు. అయితే, జర్నీలో ఎదురైన ఇబ్బందికర పరిస్థితులకు ఒకింత షాకయ్యాడు. (Indian Passport Holder). చివరకు తన ఆవేదన నెట్టింట పంచుకున్నాడు. భారతీయ పాస్‌పోర్టులున్న వారు విదేశాల్లో ఎదుర్కునే ఇబ్బందికర పరిస్థితులను నిర్మొహమాటంగా చెప్పుకొచ్చాడు (Solo Traveller Experience). ఇలాంటి అనుభవాల గురించి ఎవరూ పెద్దగా మాట్లాడరంటూ అతడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై ప్రస్తుతం పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

భారతీయ పాస్‌పోర్టుతో విదేశీ పర్యటనలపై జయంత్ శర్మ అనే వ్యక్తి ఇన్‌‌స్టాలో తన అనుభవాల్ని పంచుకున్నాడు. ‘భారతీయ పాస్‌పోర్టు ఉన్న వారు విదేశాల్లో చవిచూసే ఇబ్బందికర పరిస్థితులు ఇవి. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని ముందుగా ఎవరూ హెచ్చరించరు. గైడ్ బుక్స్, సోషల్ మీడియా రీల్స్ వంటి వేదికల్లో వీటి ప్రస్తావన ఉండదు. కేవలం అవతలి వారి చూపుల్లో ఇది స్పష్టమవుతంది. వారి మౌనం తెలియని చికాకు పెడుతుంది. మనమూ మనుషులమని రుజువు చేసుకునేందుకు నింపాల్సి డాక్యుమెంట్స్‌లో ఈ కోణం కనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.


విదేశాల్లో భారతీయులకు ఇమిగ్రేషన్ అంటే కేవలం చెక్ పాయింట్స్ వద్ద తనిఖీలు కాదని అన్నాడు. ఈ చెక్ పాయింట్స్ వద్ద భారతీయులు అనేక అదనపు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాడు. భారతీయ పాస్‌పోర్టు ఉన్న వారిపై నిఘా ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. టూరిస్టుగా కంటే మనతో ఏదో రిస్క్ ఉందన్న భావన కలిగిస్తారని అన్నాడు. ఇక తన లాంటి యువ పర్యాటకులకు స్వదేశానికి తిరిగెళతామని నిరూపించుకోవడమే పెద్ద సవాలని తెలిపాడు.

‘కేవలం 7 రోజుల పర్యటనకు కూడా నేను సవాలక్ష ప్రశ్నలను ఎదుర్కొన్నాను. టూర్‌లో ఏ ప్రాంతాలను చూడాలన్న ప్రణాళిక కంటే పర్యటన తరువాత తిరిగి వెళతానని ఎంబసీలకు నమ్మకం కలిగించేందుకే ఎక్కువ సమయం పట్టింది. ఓ బోర్డర్ కంట్రోల్ వద్ద ఆఫీసర్ మూడు సెకెన్ల పాటు తదేకంగా చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. భవిష్యత్తులో మనం ఇలాంటివి ఎదుర్కోవాల్సిన దుస్థితిని తప్పుతుందనే అనుకుంటున్నా’


‘జనాలు జాలి చూపిస్తారన్న ఉద్దేశంతో ఈ పోస్టు పెట్టలేదు. వాస్తవం ఏంటో తెలియజెప్పడానికే ఈ పోస్టు పెట్టా. విదేశీ పర్యటనల్లో నా లాగా ఇబ్బంది పడ్డ వారు, అవమానం, తృణీకరణకు గురైన వారి పరిస్థితిని నేను అర్థం చేనుకోగలను. మనమేమీ స్పెషల్ ట్రీట్‌మెంట్ కోరట్లేదు. కేవలం స్వేచ్ఛగా పర్యటించాలని అనుకుంటున్నామంతే’ అని తెలిపాడు. ఈ పోస్టుకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఎవరూ చెప్పని విషయాలను ధైర్యంగా పంచుకున్నందుకు అనేక మంది ధన్యవాదాలు తెలిపారు.


ఇవీ చదవండి:

జీతంలో 50 శాతం పన్నులకే.. ఐరోపా లైఫ్‌పై ఎన్నారై పోస్టు వైరల్

ఈ పని మాత్రం అస్సలు చేయొద్దు.. హెచ్‌1బీ వీసాదారులకు నెటిజన్ సూచనపై పెద్ద చర్చ

Read Latest and Viral News

Updated Date - Jul 19 , 2025 | 04:59 PM