Share News

ISKON Restaurant Incident: లండన్‌లోని ఇస్కాన్ రెస్టారెంట్‌లో షాకింగ్ సీన్.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 20 , 2025 | 05:31 PM

లండన్‌లోని ఓ ఇస్కాన్ రెస్టారెంట్‌లో ఓ బ్రిటన్ యువకుడు అక్కడి సిబ్బంది అభ్యంతరాలను ఖాతరు చేయకుండా నాన్ వెజ్ ఆహారం తిన్న ఉదంతం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ISKON Restaurant Incident: లండన్‌లోని ఇస్కాన్ రెస్టారెంట్‌లో షాకింగ్ సీన్.. వీడియో వైరల్
Govinda restaurant incident

ఇంటర్నెట్ డెస్క్: లండన్‌లో ఇస్కాన్‌కు చెందిన గోవిందా రెస్టారెంట్‌లో ఓ బ్రిటన్ యువకుడు చేసిన దారుణం ప్రస్తుతం కలకలం రేపుతోంది. అది పూర్తి శాకాహార వంటకాలను విక్రయించే రెస్టారెంట్ అని తెలిసినా అతడు పట్టించుకోకుండా తన వెంట తెచ్చుకున్న చికెన్ నగ్గెట్స్‌ను తినడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విపరీత చర్యకు పాల్పడిన ఆఫ్రికన్ సంతతి యువకుడిపై జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఆ యువకుడు తొలుత రెస్టారెంట్‌లోకి వచ్చి నాన్ వెజ్ వంటకాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించాడు. రెస్టారెంట్ సిబ్బంది మాత్రం తమ వద్ద అలాంటివి ఉండవని స్పష్టంగా సమాధానం ఇచ్చారు. యువకుడు మాత్రం పదే పదే నాన్ వెజ్ వంటకాల గురించి ప్రశ్నించాడు. ఆ తరువాత తన వెంట తెచ్చుకున్న కేఎఫ్‌సీ చికెన్ నగ్గెట్స్‌ బాక్స్‌ను కౌంటర్ ముందు పెట్టి సిబ్బంది ముందే తినడం ప్రారంభించాడు. ఇతర కస్టమర్స్‌కు వాటిని ఇచ్చేందుకు ప్రయత్నించాడు. పరిస్థితి చేయి దాటుతుండటంతో సిబ్బంది అప్రమత్తమై సెక్యూరిటీ వాళ్లకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి యువకుడిని బయటకు పంపించేశారు.


వీడియోలో ఇదంతా చూసిన జనాలు షాకైపోతున్నారు. యువకుడిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అతడి చర్యల్లో జాత్యాహంకార ధోరణులు కనిపిస్తున్నాయని అన్నారు. అతడు దురుద్దేశపూర్వకంగానే ఇదంతా చేశాడని కొందరు మండిపడ్డారు. ఇతరుల సంస్కృతులు, అలవాట్లు, నిబంధనల విషయంలో గౌరవంగా నడుచుకోవాలని హితవు పలికారు. బహిరంగ ప్రదేశాల్లో కనీస మర్యాదతో ప్రవర్తించాలని అన్నారు. ఇలాంటి వాళ్లు సమాజానికి ఇబ్బందికరమని కొందరు అన్నారు. భగవద్గీత బోధనలు, కృష్ణ భక్తిని ప్రపంచవ్యాప్తం చేసేందుకు ఇస్కాన్ సంస్థను స్వామి ప్రభుపాద 1966లో స్థాపించిన విషయం తెలిసిందే.


ఇవీ చదవండి:

22 ఏళ్ల వయసులో ఒంటరిగా విదేశీ యాత్ర.. ఈ భారతీయ యువకుడి అనుభవం ఏంటో తెలిస్తే..

ఈ పని మాత్రం అస్సలు చేయొద్దు.. హెచ్‌1బీ వీసాదారులకు నెటిజన్ సూచనపై పెద్ద చర్చ

Read Latest and Viral News

Updated Date - Jul 20 , 2025 | 05:40 PM