Share News

Delhi: కార్లలో ర్యాష్ డ్రైవింగ్.. పోలీసులు ఏం చేశారంటే? వీడియో వైరల్

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:48 AM

దేశంలో రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంత మంది పోకిరీలు రోడ్డుపై ర్యాష్ డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

Delhi: కార్లలో ర్యాష్ డ్రైవింగ్.. పోలీసులు ఏం చేశారంటే? వీడియో వైరల్
Delhi Ring Road Incident

ఇంటర్నెట్ డెస్క్ : ఓ వైపు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా.. జరిమానాలు విధిస్తు్న్నా కొంతమంది నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఢిల్లీ రింగ్ రోడ్‌లో కొంతమంది పోకిరీలు నిర్లక్ష్యంగా కార్లు నడుపుతూ ప్రమాదకర విన్యాసాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫుటేజ్‌లో కార్లు వేగంగా దూసుకుపోవడం, కేరింతలు కొడుతు ట్రాఫిక్‌లో తిరగడం, సన్ రూఫ్‌ల నుంచి బయట నిలబడి చేతులు ఊపుతూ అల్లరి చేయడం కనిపించింది. దీనిపై స్పందించిన ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


ఈ వీడియో డిసెంబర్ 27 న తమ దృష్టికి వచ్చిందని, డిసెంబర్ 26 రాత్రి 10.44 గంటల ప్రాంతంలో ఈ ఫుటేజ్ రికార్డ్ చేయబడిందని చెబుతున్నారు. వీడియో ఆన్ లైన్ లో వైరల్ కావడంతో నిందితులను గుర్తించడంలో ఈజీ అయ్యిందని పోలీసులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. పోలీసులు సత్వరమే స్పందించి పోకిరీలను అరెస్ట్ చేయడంపై ప్రశంసలు కురిపించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాతోందని పోలీసు అధికారులు తెలిపారు.


ఇవీ చదవండి:

ఎంత దారుణం! ఐదుగురు పిల్లల తల్లి.. కన్నబిడ్డలపై కనికరం లేకుండా..

ఇది ఏఐ నామ సంవత్సరం.. ఆశ్చర్యం కలిగించే మార్పులు

Updated Date - Dec 29 , 2025 | 12:03 PM