Pak Fan Switches Jersey: భారత్-పాక్ మ్యాచ్‌లో ఊహించని ట్విస్ట్.. పాక్ అభిమాని చేసిన పని చూస్తే..
ABN , Publish Date - Sep 15 , 2025 | 01:26 PM
తన టీమ్ ఓటమితో నిరాశ చెందిన ఓ పాక్ అభిమాని చివరకు టీమిండియా జెర్సీ ధరించి భారత్‌కు జేజేలు పలుకుతూ స్టేడియంలో డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు ఈ వీడియోపై పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత్ పాక్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. భారత్‌కు కనీసం గట్టి పోటీ అయినా పాక్ ఇస్తుందని ఊహించిన దాయాది దేశ అభిమానులు చివరకు నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలో ఓ పాకిస్థానీ అభిమాని చేసిన పని నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది. పాక్ ఓటమి తప్పదని అర్థమైపోయాక అతడు పాకిస్థానీ జట్టు జర్సీపై టీమిండియా జెర్సీని ధరించాడు సంతోషంతో చిందులేశాడు. (Pakistan fan switches jersey).
ఈ మ్యాచ్‌లో తొలి నుంచి పాక్‌పై భారత్ ఆధిపత్యం కనబరిచిన విషయం తెలిసిందే. అయితే, మ్యాచ్ తొలి ఓవర్లలో పాక్ అభిమానులకు తమ జట్టు గెలవొచ్చన్న చిన్న ఆశ కలిగింది. భారత్ వరుసగా కీలక వికెట్లు కోల్పోయిన దశలో వారికి గెలుపుపై ఆశలు చిగురించాయి. కానీ చూస్తుండగానే సీన్ తిరగబడింది. ఈ క్రమంలో పాకిస్థానీ జట్టుకు చెందిన ఓ అభిమాని తన పాక్ జెర్సీపైన టీమిండియా జెర్సీ వేసుకున్నాడు. అసలు పాక్ గురించే మర్చిపోయినట్టు, ఆ విషాదాన్ని అధిగమించినట్టు భారత్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ చిందులు వేశాడు. ఈ సీన్ చూసి స్టేడియంలో వారు కూడా పడీపడీ నవ్వుకున్నారు (jersey swap India Pakistan). ఇక నెట్టింట కూడా ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. టీమిండియా ఎఫెక్ట్‌తో అతడు వెంటనే ప్లేటు ఫిరాయించేశాడని సెటైర్లు పేల్చారు.
స్టేడియంలో ఇంత కోలాహలంగా ఉన్నా మైదానంలో మాత్రం ఇరు జట్లు సీరియస్‌గా తలపడ్డాయి. కుల్‌దీప్ యాదవ్ (3/18), అక్షర్ పటేల్ (2/18) తమ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో తొలుత పాక్‌ను 127 పరుగులకే కట్టడి చేయగలిగారు. షాహీన్ అఫ్రీదీ 16 బంతుల్లో 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచి పాక్ ఇన్నింగ్స్‌కు ఒకే ఒక హైలైట్‌గా మిగిలాడు. ఇక ఛేదనలో మొదట అభిషేక్ శర్మ విజృంభించాడు. ఆ తరువాత రంగంలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక మ్యాచ్ సందర్భంగా భారత్ ప్లేయర్లు పాక్ క్రీడాకారులకు కనీసం కరచాలనం కూడా చేయకుండా తమ పని ముగించుకుని మైదానం వీడిన విషయం కూడా చర్చనీయాంశంగా మారింది (viral Asia Cup fan moment).
ఇవి కూడా చదవండి:
శాలరీ పెంచడం ఇష్టం లేక ఉద్యోగిని తొలగించిన కంపెనీకి భారీ షాక్
పిజ్జా డెలివరీ బాయ్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ.. నెట్టింట వెల్లువెత్తిన ఆగ్రహం