Nigerian Woman-Pani Puri: భారత్ అంటే ఇదీ.. ఈ ఆఫ్రికా మహిళ సంబరానికి కారణం తెలిస్తే
ABN , Publish Date - Dec 10 , 2025 | 06:40 PM
పానీ పూరీని రుచిచూసి మైమరిచిపోతూ ఓ ఆఫ్రికా మహిళ డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. పానీ పూరీ ఎఫెక్ట్ ఇలాగే ఉంటుందని అనేక మంది కామెంట్ చేశారు. భారత్‌లో ఇలాంటివి అనేకం ఉన్నాయని, వాటినీ ట్రై చేయాలని సలహా ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ వంటకాల గొప్పదనం, విస్తృతి తెలియాలంటే కచ్చితంగా ఇక్కడ జరిగే పెళ్లిళ్లకు హాజరు అవ్వాలి. ఈ విషయాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకున్న ఓ ఆఫ్రికా మహిళ సంబరానికి అంతే లేకుండా పోయింది. స్వయంగా షెఫ్ అయిన ఆమె ఇక్కడి రుచులకు తెగ మురిసిపోయారు. మైమరచిపోయి స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Nigerian Woman Tastes Panipuri).
నైజీరియాకు చెందిన సదరు మహిళ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. ముంబైలో ఆమె ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అక్కడ రెండు పానీ పూరీలను టేస్టు చేసిన ఆమె ఆ రుచికి మైమరచిపోయారు. చివరకు డ్యాన్స్ కూడా చేశారు. ప్రస్తుతం తాను టూర్‌లో ఎలా ఎంజాయ్ చేస్తున్నాననే విషయాన్ని కూడా ఆమె వివరించారు. ముంబైలో ల్యాండైన వెంటనే ఇక్కడి వంటకాలను ఆస్వాదించడం ప్రారంభించినట్టు వివరించారు. తాను శాకాహారిని అయినా ముంబైకి రాగానే ముందు ఇక్కడ చికెన్ బిర్యానీని ఎంజాయ్ చేసినట్టు తెలిపారు. పానీ పూరీ మాత్రం అద్భుతమని అన్నారు. ప్రస్తుతానికి పానీ పూరీ తప్ప మరేదీ వద్దని మనసు గోల చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు (Nigerian Woman Viral Video).
ఈ వీడియో సహజంగానే నెట్టింట వైరల్‌గా మారింది. 15 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. భారతీయ వంటకాలు ముఖ్యంగా పానీ పూరీ రుచి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని అనేక మంది కామెంట్ చేశారు. మొదటి సారి పానీ పూరీ తిన్నప్పుడు తామూ ఇలాగే స్టెప్పులేశామని మరికొందరు కామెంట్ చేశారు. ఆ రుచిని మాటల్లో వర్ణించలేమని అన్నారు. వెల్కమ్ టూ ఇండియా.. ఇక్కడ ఇలాంటి టేస్టీ వంటకాలు అనేకం ఉన్నాయని మరికొందరు చెప్పారు. ఆమె తడబాటు లేకుండా పానీ పూరీ తినడాన్ని చూసి మరికొందరు ప్రశ్నించారు. విదేశీయులు మొదటి సారి దీన్ని తిన్నప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతారని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూడండి మరి.
ఇవీ చదవండి:
ఇంత జరిగాక చివరకు ఇచ్చేది ఇదా.. ఇండిగోపై అసంతృప్తి .. కొందరు మాత్రం..
నాకూ ఇంటికి వెళ్లాలని ఉంది.. ఇండిగో పైలట్ వీడియో నెట్టింట వైరల్