IndiGo Delay-Viral Video: ఇంత జరిగాక చివరకు ఇచ్చేది ఇదా.. ఇండిగోపై అసంతృప్తి .. కొందరు మాత్రం..
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:30 PM
టేకాఫ్ ఆలస్యం కావడంతో ఇండిగో విమానంలోని ప్రయాణికులకు స్నాక్స్ ఇచ్చిన వైనం మరోసారి నెట్టింట సంస్థ పేరును ట్రెండింగ్‌లోకి తెచ్చింది. ఈ ఉదంతంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా కొందరు సంస్థకు అండగా నిలవడం కొసమెరుపు.
ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని రోజులతో పోలిస్తే ప్రస్తుతం ఇండిగోలో కార్యకలాపాలు కాస్త మెరుగుపడినట్టే. అయితే, జనాల్లో మాత్రం ఇంకా కోపం చల్లార లేదు. దీంతో, సంస్థ పేరు నెట్టింట ఇంకా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అయితే, తాజా ఉదంతంలో కొందరు మాత్రం ఇండిగోకు మద్దతుగా నిలిచారు. విమర్శకులకు గట్టిగా బదులిచ్చే ప్రయత్నం చేశారు (IndiGo Flight Delay, Viral Apology). అసలేం జరిగిందంటే..
ఇండిగో విమానంలో సిబ్బంది తమకు ఇచ్చిన స్నాక్స్‌ను చూపిస్తూ ఓ వ్యక్తి నెట్టింట ఈ పోస్టు పెట్టారు. విమానం ఇండిగో విమానం దాదాపు 9 గంటల పాటు ఆలస్యం కావడంతో ప్రయాణికులకు పాప్‌కార్న్, ఫ్రూట్ జ్యూస్ ఇచ్చారని చెప్పారు. ఎప్పటిలాగే సంస్థపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ని గంటల ఆలస్యమైతే ఏవో కొన్ని స్నాక్స్ ఇచ్చి సారీ చెప్పి సరిపెట్టారు’ అన్న క్యాప్షన్ జత చేశారు.
దీంతో, ఈ వీడియో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న ఫ్లైట్ క్యాన్సిలేషన్స్‌ను ప్రస్తావించారు. ఇన్ని గంటలు ఆలస్యం చేశాక చివరకు ఇలాంటివి ఇస్తే ఏం సరిపోతుందని ప్రశ్నించారు.
కొందరు మాత్రం ఇండిగోకు మద్దతుగా నిలిచారు. ‘ఫ్లైట్‌లు ఆలస్యం అయితే ఎంత ఇరిటేటింగ్‌గా ఉంటుందో అందరికీ తెలుసు. అయితే, ఈ విషయంలో ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పడమే కాకుండా స్నాక్స్ కూడా ఇచ్చింది. కానీ దీన్ని కూడా జోక్‌గా మార్చి నెటిజన్ల దృష్టిలో పడాలనుకోవడం పరిపక్వత అనిపించుకోదు’ అని ఓ వ్యక్తి మండిపడ్డాడు. ఇండిగో తప్పు కొంత ఉన్నప్పటికీ మధ్యతరగతి వర్గాల ఫ్లైట్ జర్నీ కలను సాకారం చేసిందన్న విషయం మర్చిపోవద్దని మరికొందరు అన్నారు. ఇతర దేశాల్లో దేశీయ విమానప్రయాణాల్లో ఇలాంటి స్నాక్స్ ఏవీ ఉండవన్న విషయం మర్చిపోకూడదని మరికొందరు చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరీ మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
నాకూ ఇంటికి వెళ్లాలని ఉంది.. ఇండిగో పైలట్ వీడియో నెట్టింట వైరల్
చైనా అభివృద్ధి చూసి అమెరికన్‌కు షాక్.. టెక్నాలజీ మరీ ఈ రేంజ్‌లోనా..