Share News

Funny Viral Video: ఆనందంలో అత్యుత్సాహం అంటే ఇదే.. కొత్త స్కూటీకి పూజలు చేస్తుండగా..

ABN , Publish Date - Jan 29 , 2025 | 10:56 AM

కొత్తగా స్కూటీని కొన్న ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. స్కూటీని ముస్తాబు చేసిన వారు.. ముందుగా రంగు రంగు కాగితలా టపాసులను పేల్చారు. ఇంతవరకూ అంతా బాగానే జరిగింది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

Funny Viral Video: ఆనందంలో అత్యుత్సాహం అంటే ఇదే.. కొత్త స్కూటీకి పూజలు చేస్తుండగా..
Youth burst firecrackers in front of new scooty

కాస్త వినూత్నంగా ఆలోచించాలే గానీ.. సోషల్ మీడియాలో ఫేమస్ అవడం పెద్ద కష్టమేమీ కాదు. కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ వింత వింత వీడియోలను రూపొందిస్తూ నెట్టింట్లోకి వదులుతుంటారు. తద్వారా ఫేమస్ అవడంతో పాటూ ఆదాయాన్ని కూడా గడిస్తు్న్నారు. విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొత్త స్కూటీకి పూజలు చేసి టపాసులు కాల్చారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొత్తగా స్కూటీని కొన్న ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. స్కూటీని ముస్తాబు చేసిన వారు.. ముందుగా రంగు రంగు కాగితలా (Youth burst firecrackers in front of new scooty) టపాసులను పేల్చారు. ఇంతవరకూ అంతా బాగానే జరిగింది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Bike Driving Video: పొగ ఆవరించినా ముందుకు దూసుకెళ్లాడు.. చివరకు కళ్లెదురుగా ఉన్నది చూసి ఖంగుతిన్నాడు..


రంగు కాగితాల టపాసులు పేల్చిన తర్వాతా శబ్ధం వచ్చే టపాసులను పేల్చడానికి సిద్ఢమవుతారు. టపాసులకు నిప్పంటించి దూరంతా వెళ్లిపోతారు. అయితే టపాసులు పేలిన మరుక్షణమే షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. సీన్ కట్ చేస్తే.. పూర్తిగా కాలిపోయిన స్కూటీపై (new scooty was burnt in fire) ఓ యువకుడు నీళ్లు చల్లుతుంటాడు. తన కొత్త స్కూటీ కాలిపోవడాన్ని తట్టుకోలేక సదరు యువకుడు ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోతాడు.

Viral Video: ఇదేం స్నాక్స్‌రా బాబోయ్.. మిరపకాయలంటేనే భయం పుట్టేలా..


ఇదంగా చూస్తుంటే నవ్వుకోవడానికి చేసినట్లుగా అనిపిస్తున్నా.. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బ్రదర్ ఓవర్ ఎగ్జైట్ అయినట్టున్నాడు’’.. అంటూ కొందరు, ‘‘బ్రదర్ వెంటనే ఇన్సూరెన్స్‌కు అప్లై చేసుకోండి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: టెంట్‌లో చలికి వణికిపోతున్న వ్యక్తి.. ఓపెన్ చేసి బయట చూడగా.. షాకింగ్ సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 29 , 2025 | 10:56 AM