Share News

Seagull eats rabbit: ఈ పక్షి చూడండి.. కుందేలును అమాంతం ఎలా మింగేసిందో.. షాకింగ్ వీడియో వైరల్..

ABN , Publish Date - Aug 24 , 2025 | 05:54 PM

ఆటవిక ప్రపంచం చాలా మార్మికమైనది. అక్కడ బలమైన వాళ్లదే రాజ్యం. బలహీనులు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం రోజూ అప్రమత్తంగా ఉండాల్సిందే. బలవంతులు తమ ఆహారం కోసం రోజూ వేట సాగించాల్సిందే.

Seagull eats rabbit: ఈ పక్షి చూడండి.. కుందేలును అమాంతం ఎలా మింగేసిందో.. షాకింగ్ వీడియో వైరల్..
Seagull eats rabbit

ఆటవిక ప్రపంచం చాలా మార్మికమైనది. అక్కడ బలమైన వాళ్లదే రాజ్యం. బలహీనులు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం రోజూ అప్రమత్తంగా ఉండాల్సిందే. బలవంతులు తమ ఆహారం కోసం రోజూ వేట సాగించాల్సిందే. అయితే సాధారణంగా చేపలు, కీటకాలను తినే పక్షులు ఏకంగా కుందేలు (Rabbit)ను తినగలవని ఊహించగలమా? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో (seagull swallows rabbit whole) చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.


@detailedexplanation అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. సముద్ర పక్షి అయిన సీగుల్ (seagull rabbit video) ఓ కుందేలును వేటాడడం చూడొచ్చు. తన బొరియలో దాక్కున్న కుందేలును ఓ సీగల్ చూసింది. నేరుగా అక్కడకు వెళ్లి ఆ కుందేలును బయటకు లాగింది. ఆపై దాని నోటితో కుందేలు తలను పట్టుకుని సజీవంగా మింగేసింది. సాధారణంగా సీగల్‌లు చేపలు, కీటకాలు, చిన్న పీతలు, నత్తలు, చిన్న పక్షులను వేటాడతాయి. కానీ ఇలా జీవించి ఉన్న కుందేలును మింగడం నమ్మశక్యం అనిపించడం లేదు.


ఈ వీడియోకు సోషల్ మీడియాలో లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. వేల మంది ఆ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. సీగల్ పక్షులు ప్రాంతాలను బట్టి తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటాయని ఒకరు కామెంట్ చేశారు. ఆ కుందేలును ఆ పక్షి ఎలా జీర్ణించుకుంటుంది అని మరొకరు ప్రశ్నించారు. ఇది తనకు నమ్మశక్యంగా లేదని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. గద్దకు ఇంత బలముంటుందా.. జింక పిల్లను ఎలా పట్టుకుందో చూడండి..

ఇది రాజమౌళి ఈగ కంటే పవర్‌ఫుల్.. ఓ గోల్ఫర్‌కు రూ.8 కోట్లు సంపాదించిపెట్టింది..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 24 , 2025 | 08:00 PM