Share News

Pit Bull Attack: ఇదేం పైశాచికత్వం రా.. చిన్నారిపై పిట్ బుల్ కుక్కను ఉసిగొల్పి..

ABN , Publish Date - Jul 21 , 2025 | 08:05 AM

ముంబైలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆటోలో ఆడుకుంటున్న బాలుడిపై ఓ వ్యక్తి తన పెంపుడు పిట్ బుల్ కుక్కను ఉసిగొల్పాడు. అది బిడ్డ చెంపపై కొరకడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Pit Bull Attack: ఇదేం పైశాచికత్వం రా.. చిన్నారిపై పిట్ బుల్ కుక్కను ఉసిగొల్పి..
Mumbai Pit Bull Attack on Kid

ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో తాజాగా షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆటోలో ఆడుకుంటున్న 11 ఏళ్ల బాలుడిపై ఓ వ్యక్తి తన పెంపుడు పిట్‌ బుల్ కుక్కను ఉసిగొల్పిన ఘటన కలకలం రేపుతోంది. చిన్నారిపై ఎగబడ్డ కుక్క అతడిని కరవడంతో బిడ్డ గాయాలపాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కుక్కను చూసి బెదిరిపోయిన బాలుడు ఆటోలో ఓ మూలకు జరిగి కూర్చొన్నాడు. పిల్లాడు వణికిపోతున్నా కూడా పెంపుడు కుక్క యజమాని మహ్మద్ సోహెయిల్ హసన్ కనికరం చూపించలేదు. పైపెచ్చు పిల్లాడిని చూసి నవ్వుతూ పైశాచికానందం పొందాడు. ఇక పిల్లాడి పక్కనే ఉన్న కుక్క సడెన్‌గా లేచి అతడి గడ్డాన్ని కొరికింది. కుక్క నుంచి ఎలాగొలా తప్పించుకుని బయటకు వచ్చేందుకు బాలుడు ప్రయత్నించగా అతడి షర్ట్ పట్టి వెనక్కు లాగింది. కుక్క దాడితో చిన్నారి భయపడిపోతున్నా సొహెయిల్ మాత్రం కనికరం లేకుండా పెద్ద పెట్టున నవ్వాడు. చివరకు బాలుడు ఆటోలోంచి ఎలాగొలా బయటపడ్డాడు.


‘కుక్క నన్ను కరిచింది. వెంటనే నేను పరుగు తీశాను. ఆ తరువాత కుక్క నా షర్టు పట్టి వెనక్కు లాగింది’ అని బాధిత బాలుడు హమ్జా చెప్పుకొచ్చాడు. కుక్కను కట్టడి చేయాలని ఎంత వేడుకున్నా సొహెయిల్ నవ్వుతూ ఎంజాయ్ చేశాడని బాలుడు వాపోయాడు. తనకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని, అంతా ఈ దృశ్యాల్ని వీడియో తీస్తూ ఎంజాయ్ చేశారని తెలిపాడు. ఇప్పటికీ తనకు ఆ ఘటన తలుచుకుంటే వెన్నులోంచి వణుకు వస్తోందని అన్నాడు.

కాగా, బాధిత బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు నిందితుడు సోహెయిల్‌పై కేసు నమోదు చేశారు. పిల్లాడు ఆటోలో ఆడుకుంటుండగా సోహెయిల్ తన కుక్కును చిన్నారి పైకి వదిలిపెట్టాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 291, 125 కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడికి సెక్షన్ 3(3) కింద నోటీసులు జారీ చేశారు. ఇక నెట్టింట వైరల్‌‌గా మారిన ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఇవీ చదవండి:

క్యాన్సర్‌తో మరణం అంచున యువతి.. మిగిలిన టైంలో ఏం చేయాలో చెప్పాలంటూ పోస్టు

లండన్‌లోని ఇస్కాన్ రెస్టారెంట్‌లో షాకింగ్ సీన్.. వీడియో వైరల్

Read Latest and Viral News

Updated Date - Jul 21 , 2025 | 08:58 AM