Viral Video: లేటు వయసులో వెయిట్ లిఫ్టింగ్.. ఈ బామ్మ టాలెంట్ గురించి తెలిస్తే..
ABN , Publish Date - May 02 , 2025 | 02:38 PM
70 Year Old Women Weighlifting: 60 ఏళ్లు దాటితే నడవటానికే కష్టపడుతుంటారు చాలామంది. కానీ, ఈ బామ్మ 70 ఏళ్ల వయసులో ఆర్థిరైటిస్ సమస్య ఉన్నా అలవోకగా వందల కిలోల బరువులు ఎత్తేస్తోంది. ఈ వెయిట్ లిఫ్టింగ్ బామ్మ జిమ్‌లో చేసే వర్కవుట్లు చూస్తే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే.
Knee Arthritis Old Women Weighlifting: లేటు వయసులో వెయిట్ లిఫ్టింగ్ చేసేస్తూ ఇంటర్నెట్ సంచలనంగా మారింది ఓ 70 ఏళ్ల బామ్మ. 30 ప్లస్ రాగానే నడిచినా, పరిగెత్తినా ఆయాసంతో చతికిలపోయే వాళ్లున్న ఈ రోజుల్లో.. తరగని ఉత్సాహం, స్టామినాతో తేలికగా బరువులెత్తేస్తూ యువతలో స్ఫూర్తి నింపుతోంది. వయసు పెరిగినంత మాత్రాన ఫిట్‌నెస్ కోసం వర్కవుట్లు చేయకూడదా అని ప్రశ్నిస్తోంది. మోకాళ్లకు ఆర్థరైటిస్ సమస్య ఉన్నా సునాయాసంగా వెయిట్ లిఫ్టింగ్ చేసేస్తూ.. "వెయిట్ లిఫ్టర్ మమ్మీ" గా పేరుగాంచిన ఆ బామ్మ టాలెంట్ చూస్తే మీకే తెలుస్తుంది.
కొడుకు ప్రేరణతో
ఢిల్లీకి చెందిన రోష్ణీ దేవికి కొన్నేళ్ళ క్రితం ఆర్థరైటిస్ వచ్చింది. అంతముందే తీవ్రమైన కీళ్ల నొప్పులు కూడా ఉండేవి. ఆ నొప్పికి పరిష్కారంగా వ్యాయామం చేయమని ఆమె కుమారుడు అజయ్ సంగ్వాన్ జిమ్‌కు తీసుకెళ్లాడు. పెద్ద వయసు కాబ్టటి జిమ్‌లో మొదట్లో బాగా ఇబ్బందిపడేది. అయితే, కొడుకు మద్దతుతో నెమ్మదిగా జిమ్‌లో వివిధ వ్యాయామాలను ఆస్వాదించడం ప్రారంభించింది. తర్వాత వెయిట్ లిఫ్టింగ్ కూడా చేయడం మొదలెట్టింది. ఇటీవల రోష్ణి బామ్మ 60 కిలోల డెడ్‌లిఫ్ట్, 40 కిలోల స్క్వాట్‌లు, 100 కిలోల లెగ్ ప్రెస్ చేస్తున్న వీడియో ఒక నెటిజన్ షేర్ చేయడంతో ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది.
రెండేళ్లుగా జిమ్ చేస్తున్న రోష్ణి దేవి మునుపటి కంటే ఆరోగ్యంగా ఉన్నానని..కీళ్ల నొప్పులు మటుమాయం అయ్యాయని చెబుతోంది. వ్యాయామం చేయడం ఒక్కటే ప్రస్తుతం తనకు అత్యంత ఆనందాన్ని కలిగించే విషయమని అంటోంది. ఆమె వ్యాయామ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడల్లా వందలాది మంది ఆశ్చర్యపోవడమే కాదు. వాటిని లైక్ చేసి అభినందిస్తూ ప్రోత్సహిస్తుంటారు. రోష్ణి దేవి దినచర్యలో రోజూ ఒక గంట వెయిట్ ట్రైనింగ్, కార్డియో వ్యాయామాలు ఉంటాయి. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని.. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటం జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం అని ఈ బామ్మ సలహా ఇస్తోంది.
Read Also: Viral Video: పడిపోయిన గుర్రం, ఎక్కడ జంతు ప్రేమ..ఓనర్ నిర్లక్ష్యంపై పోలీసుల కేసుPicture Puzzle: మీ అబ్జర్వేషన్‌పై నమ్మకముందా.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 21 సెకెన్లలో కనిపెట్టండి
Viral Video: పెళ్లికి ముందు అనుకోని సంఘటన.. మండపంగా మారిన ఆస్పత్రి..