Meerut Theft: సెకెండ్ హ్యాండ్ బైక్‌పై టెస్టు రైడ్ చేస్తానని చెప్పి వాహనంతో జంప్
ABN , Publish Date - Sep 21 , 2025 | 06:42 PM
సెకెండ్ హ్యాండ్ బైక్ కొనేందుకు షాపుకెళ్లిన ఓ వ్యక్తి టెస్టు రైడ్ చేస్తానని చెప్పి బైక్ తీసుకుని పారిపోయిన ఉదంతం యూపీలో చోటు చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: టూ వీలర్ కొంటానంటూ వచ్చిన ఓ వ్యక్తి టెస్టు రైడ్ చేస్తానని చెప్పి బైక్‌ను చోరీ చేసిన ఉదంతం యూపీలోని మీరట్‌లో చోటుచేసుకుంది. దొంగ చేసిన పనికి అవాక్కయిన షాపు యజమాని చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందిరా గేట్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది (bike stolen test drive Meerut).
రషీద్ అనే వ్యక్తి స్థానికంగా బైక్ రిపేరింగ్ షాపు నిర్వహిస్తుంటాడు. సెకెండ్ హ్యాండ్ వాహనాలను కూడా విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి రషీద్ షాపునకు వచ్చి సెకెండ్ హ్యాండ్ బైక్‌ను కొంటానని అన్నాడు. రూ.15 వేలకు వారి మధ్య అవగాహన కూడా కుదిరింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి వాహనాన్ని ఓసారి టెస్టు రైడ్ చేస్తానని అన్నాడు. దీంతో, అతడికి రషీద్ బైక్ ఇచ్చాడు. బైక్ తీసుకుని బయలుదేరిన సదరు వ్యక్తి ఆ తరువాత మళ్లీ తిరిగి రాలేదు. అతడి కోసం సాయంత్రం వరకూ వేచి చూసిన రషీద్ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు (fake buyer bike theft).
సాధారణ వ్యక్తిలా నటిస్తూ నిందితుడు షాపు యజమానిని బురిడీ కొట్టించాడని పోలీసులు తెలిపారు. అతడు తెల్ల షర్టు, ప్యాంటు, తెల్లని టోపీ పెట్టుకుని ఉన్నట్టు సీసీటీవీ కెమెరాల్లో కనిపించింది. అతడి మెడకు స్కార్ఫ్ కూడా పెట్టుకున్నాడు. అయితే, బైక్ అసలు ఓనర్ ఎవరో తెలిపే డాక్యుమెంట్స్‌ను కూడా తీసుకురావాలని పోలీసులు షాపు యజమాని రషీద్‌కు చెప్పారు. అప్పుడే ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు సాధ్యమవుతాయని అన్నారు (test drive disappearance).
ఈ ఘటనపై స్థానిక సర్కిల్ ఆఫీసర్ స్పందించారు. తనకు ఈ ఘటనకు సంబంధించి ఇంకా అధికారిక సమాచారం ఏదీ అందలేదని అన్నారు. అయితే, పూర్తి వివరాలతో బాధితుడు కంప్లయింట్ చేస్తే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇది కూడా చదవండి:
హారతి పళ్లెంలో డబ్బుల చోరీ.. షాకింగ్ వీడియో
ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో బెడ్ షీట్‌ల చోరీ.. ప్రయాణికుల నిర్వాకం.. నెట్టింట వీడియో వైరల్