Hair saloon Theft: హారతి పళ్లెంలో డబ్బుల చోరీ.. షాకింగ్ వీడియో
ABN , Publish Date - Sep 21 , 2025 | 05:58 PM
హెయిర్ సెలూన్‌లోని రిసెప్షనిస్టును ఓ యువకుడు ఏమార్చి కౌంటర్ టేబుల్‌పై ఉన్న హారతి పళ్లెంలోని డబ్బులను చోరీ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు షాకయిపోయేలా చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఓ యువకుడు హారతి పళ్లెంలోని డబ్బును చోరీ చేస్తూ సీసీటీవీ కెమెరాకు చిక్కాడు. తెలివిగా చోరీ చేస్తున్నానని అనుకుని అడ్డంగా బుక్కయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ హెయిర్ సెలూన్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది (Puja thali theft video).
ఘటన ఏ ప్రాంతంలో జరిగిందీ తెలియరానప్పటికీ ఈ ఉదంతం నెట్టింట తెగ ట్రెండవుతోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఇద్దరు వ్యక్తులు సెలూన్‌కు వచ్చారు. కౌంటర్ వద్ద నిలబడ్డ యువతితో ఏదో మాట్లాడం ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడ కాస్త రద్దీ తక్కువగా ఉంది. ఈ లోపు ఆ యువకుడు రిసెప్షనిస్టుతో మాటలు కలిపాడు. ఆ తరువాత ఆమె తన ఫోన్ తీసి చెక్ చేసుకుంది. ఈ క్రమంలోనే యువకుడు తన పక్కనే ఉన్న హారతి పళ్లెంలో చేయి పెట్టి డబ్బులు లాగేసుకున్నాడు. జాగ్రత్తగా మడిచి చేతిలో పట్టుకున్నాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్టు రిసెప్షనిస్టుకు థ్యాంక్యూ చెప్పి, వెళ్లిపోయాడు. రెండో వ్యక్తి కూడా అతడి వెంటే బయటకు నడిచాడు. యువకుడి వెనకే ఉన్న సెక్యూరిటీ గార్డు ఉండటం కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది (hair salon theft CCTV).
ఇక ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే 16 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందల కొద్దీ కామెంట్స్ వచ్చాయి. అనేక మంది వారిని విమర్శించారు. ‘ఈ టాలెంట్‌ను మంచి పనులు చేసేందుకు వినియోగిస్తే బాగుంటుంది’ అని చురకలంటించారు. సీసీటీవీలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ ఈ యువకుడు చేసింది ఎవరికీ తెలిసుండేది కాదని మరికొందరు అన్నారు. యువకుడికి అస్సలు తెలివి లేదని మరో వ్యక్తి కామెంట్ చేశారు. ఎవరైనా చూసుంటే అతడి చెంప ఛెళ్లుమనిపించే వారని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది.
ఇది కూడా చదవండి:
ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో బెడ్ షీట్‌ల చోరీ.. ప్రయాణికుల నిర్వాకం.. నెట్టింట వీడియో వైరల్
పెంపుడు జంతువుల మధ్య పోట్లాట.. విడాకులకు సిద్ధమైన యువ జంట