Indian Workplace: వామ్మో మహిళా మేనేజర్.. ఉద్యోగిని తన కేబిన్‌కు రమ్మని..
ABN , Publish Date - Nov 20 , 2025 | 08:31 PM
ఓ మేనేజర్ తన కొడుకు హోమ్‌వర్క్‌ను ఆఫీసులోని ఓ ఉద్యోగితో చేయించిన వైనం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఉదంతంపై జనాలు షాకయిపోతున్నారు. వెంటనే సంస్థ నుంచి వెళ్లిపోవాలని ఆ ఉద్యోగికి తేల్చి చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆఫీసుల్లో తమను ఉన్నతాధికారులు రాచిరంపాన పెడుతున్నారంటూ అనేక మంది ఉద్యోగులు నెట్టింట ఆవేదన పంచుకుంటూ ఉంటారు. ఇవి నిత్యం వైరల్ అవుతుంటాయి. అయితే, నోటీస్ పీరియడ్‌లో ఉన్న ఉద్యోగితో ఓ మేనేజర్ తన కొడుకు హోమ్‌వర్క్ చేయించుకున్న వైనం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది (Manager Abuses Her Authority).
రెడిట్‌లో ఓ ఉద్యోగి తనకు ఎదురైన వింత అనుభవాన్ని నెటిజన్‌లతో షేర్ చేశారు. తాను నోటీస్ పీరియడ్‌లో ఉన్నట్టు చెప్పారు. ఈ క్రమంలో సహోద్యోగికి తన బాధ్యతలను అప్పగిస్తుండగా మేనేజర్ నుంచి అకస్మాత్తుగా పిలుపొచ్చిందని తెలిపారు. ‘ఆ రోజు ఎప్పటిలాగే ఆఫీసుకు వెళ్లా. నా పని ప్రారంభించా. ఇంతలో మా మేనేజర్ నన్ను తన కేబిన్‌కు పిలిచింది. చిన్న వ్యక్తిగత సాయం చేయాలని తెలిపింది. ఏమిటో అని అనుకుంటూ వెళ్లేసరికి తన కొడుకు హోమ్ వర్క్ గురించి నాతో చెప్పింది. వాళ్ల బాబు 12వ తరగతి చదువుతున్నాడు. ఐఐటీకి ప్రిపేర్ అవుతున్నాడు. అతడి మేథ్స్ బొమ్మలు నన్ను వేసి పెట్టమని ఆమె చెప్పింది. ఆ తరువాత మధ్యలో ఓసారి కబురు చేసి తప్పులు చేయొద్దని హెచ్చరించింది’ అని పోస్టు పెట్టాడు (Manager Asks employee to do her son's Homework).
ఈ రెడిట్ పోస్టు ఒక్కసారిగా వైరల్ అయ్యింది. అనేక మంది అతడి పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. ఇలా తమ అధికారాన్ని దుర్వినియోగం చేసే వారున్న సంస్థల్లో పని చేయొద్దని కొందరు అన్నారు. వీలైనంత త్వరగా అక్కడి నుంచి జంపయిపోవాలని హెచ్చరించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఇవీ చదవండి:
పెళ్లిలో వధువు మైమరిచిపోయి డ్యాన్స్.. మరుసటి రోజు ఆమె చేసిన పనికి..
బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ