Share News

Viral: దేవుడు అంటే ఈ వ్యక్తే! అపరిచితుడి ఆపన్నహస్తం!

ABN , Publish Date - Feb 12 , 2025 | 08:05 PM

తనకు ఏ మాత్రం పరిచయం లేని ఓ విద్యార్థి భవిష్యత్తును కాపాడేందుకు ఓ అజ్ఞాత నెటిజన్ అతడి స్కూల్ ఫీజు మొత్తం కట్టేశాడు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral: దేవుడు అంటే ఈ వ్యక్తే! అపరిచితుడి ఆపన్నహస్తం!

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాన మీడియా, సోషల్ మీడియా ఇలా ఏ వేదికలో అయినా నెగెటివ్ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోందనేది అనేక మంది నోట నిత్యం వినిపించే మాట. కానీ, ఈ అభిప్రాయాన్ని తుడిచిపెట్టే ఘటన ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రచారాభిలాష పెరిగి పోయిన నేటి జమానాలో ఓ వ్యక్తి తనకు ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తిని ఆదుకున్న తీరు చూసి జనాలు అబ్బురపడుతున్నారు. జనాలను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ (Viral) ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే..


Viral: భార్యపై ఎంత ప్రేమ ఉందో ఇలాంటి టైంలోనే తెలిసేది! కుంభమేళాలో క్యూట్ సీన్!

ఆర్యాంశ్ అనే వ్యక్తి ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నాడు. సౌరవ్ అనే వ్యక్తి సోదరుడు ఇటీవల ఎలాంటి విషమ పరిస్థితి ఎదుర్కొన్నదీ అతడు చెప్పుకొచ్చాడు. సౌరవ్ సోదరుడు స్కూల్లో చదువుకుంటున్నాడు. మరో మూడు రోజుల్లో అతడి బోర్డు పరీక్షలు ఉన్నాయి. అయితే స్కూలు ఫీజు మాత్రం పూర్తిగా చెల్లించలేదు. మొత్తం రూ.54 వేలు చెల్లించాల్సి ఉంది. అంత స్వల్ప వ్యవధిలో అంత డబ్బు సమకూర్చుకోవడం ఆ కుటుంబానికి అసాధ్యంగా మారింది. హాల్ టిక్కెట్ ఇవ్వాలని తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని ఎంత బతిమలాడినా వారు కనికరించలేదు. అయినా బిడ్డ భవిష్యత్తు కోసం వారు స్కూల్ యాజమాన్యం కాళ్లావేళ్లా పడసాగారు. ఈ క్రమంలో సౌరవ్ తన సోదరుడి కోసం నెటిజన్లు సాయం అర్థించాడు. తొలుత ఆర్యాంశ్‌కు నేరుగా మేసేజ్ చేసి పరిస్థితిని వివరించాడు. తన తమ్ముడికి సాయపడాల్సిందిగా అభ్యర్థించాడు. కుర్రాడి పరిస్థితికి చలించిపోయిన ఆర్యాంశ్, తన స్నేహితుడి సాయంతో డబ్బు కట్టేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ముందుజాగ్రత్తగా ఈ విషయాన్ని స్థానిక ఏడీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.


Viral: హోటల్ గది అద్దె గంటకు రూ.5 వేలు.. తట్టుకోలేక కుంభమేళా నుంచి తిరుగుప్రయాణం!

అసలేం జరిగిందో ఏడీజీపీ తెలుసుకునే లోపే మరో అజ్ఞాత నెటిజన్ రంగంలోకి దిగారు. సదరు స్టూడెంట్ అడ్మిషన్ నెంబర్ అడిగిన సదరు నెటిజన్ ఆ మరుక్షణమే స్కూల్ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థి బాకీ పడ్డ మొత్తాన్ని చెల్లించేశారు. రశీదును నెట్టింట పంచుకున్నారు. ఇక అభ్యంతరమేమీ లేకపోవడంతో స్కూల్ యాజమాన్యం విద్యార్థికి హాల్ టిక్కెట్ ఇచ్చేసింది.

ఇదంతా నెట్టింట పంచుకున్న ఆర్యాంశ్ ఆ ఆజ్ఞాత నెటిజన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రచారం యావ లేకుండా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే అజ్ఞాత వ్యక్తి చేసిన సాయం చూస్తే ఆశ్చర్యమేస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ఉదంతంపై నెట్టింట కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. స్వార్థం పెచ్చు మీరిన నేటి రోజుల్లో ఇలాంటోళ్లు ఇంకా ఉన్నారంటే నమ్మశక్యంగా లేదని జనాలు వ్యాఖ్యానించారు.

Read Latest and Viral News

Updated Date - Feb 12 , 2025 | 08:05 PM