Man Lifted hug Rock: బాహుబలిగా ఫీలైన వ్యక్తి.. చివరకు ఏమైందంటే?
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:30 PM
కొండల దగ్గర ఉన్న ఒక వ్యక్తి ఒక భారీ రాయిని ఎత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ రాయిని ఎత్తడమే కాకుండా, బాహుబలి లాగా దానిని తన భుజంపై వేసుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆ వీడియోను చూసిన జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. అనేక రకాల వీడియోలు నెట్టింట్లో కనిపిస్తుంటాయి. కొన్ని ఆశ్చర్యాన్ని, మరికొన్ని భయాన్ని కలిగిస్తుంటాయి. మరోవైపు కొందరు ఫేమస్ అయ్యేందుకు పలు రకాల వీడియోలు చేస్తుంటారు. రైల్వే ట్రాక్స్ పై నడుస్తూ, కొండల అంచున నిల్చోవడం వంటి అనేక రకాల ప్రమాదకమైన పనులు చేస్తుంటారు. అలానే తాజాగా ఓ వ్యక్తి..తనని తాను బహుబలిలా ఫీల్ అయ్యి..ఓ పెద్ద బండరాయిని లేపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో (Social Media)వైరల్ అవుతోన్న ఆ వీడియోను చూసినట్లు అయితే కొండల దగ్గర ఉన్న ఒక వ్యక్తి ఒక భారీ రాయిని(Man Lifted hug Rock) ఎత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ రాయిని ఎత్తడమే కాకుండా, బాహుబలి లాగా దానిని తన భుజంపై వేసుకున్నాడు. అతను ఆ రాయిని భుజంపై పెట్టుకుని కొంతకాలం నిలబడ్డాడు. వీడియోలో అతని బలం, ధైర్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో హీట్ పెచ్చింది. అతడు ఎత్తిన రాయి నిజమైనదా, కాదా అనే సందేహంతో నెటిజన్లు వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు.
మరోవైపు ఈ వీడియోపై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. కొందరు ఆ వ్యక్తి బలాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు దీనిని ఫేక్ అని అంటున్నారు. ఆ రాయి నిజమైనది కాదని, రాయిని పోలి ఉండేలా పెయింట్ చేయబడిన ధర్మా కోల్ లాంటి ఏదైనా తేలికపాటి వస్తువని చాలా మంది అంటున్నారు. ఆ వ్యక్తి కేవలం నటిస్తున్నాడని, ఇదంతా వైరల్(Video Viral) కావడానికి రూపొందించిన స్టంట్ అని మరికొందరు నెటిజన్లు(Netizens) చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో లక్షలాది మంది ప్రజల దృష్టిని ఆకర్షించింది.
ఇవి కూడా చదవండి:
Doomsday Fish Video Viral: ఓరి నాయనో.. డూమ్స్‌డేని పట్టుకొచ్చారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
సమాజంలో మార్పు.. మహిళల ద్వారానే సాధ్యం: పవన్