Unbelievable hack: ఈ టెక్నిక్ తెలియక ఎంత కష్టపడుతున్నాం.. క్యాన్ నుంచి వాటర్ ఎలా తీశాడో చూడండి..
ABN , Publish Date - Oct 29 , 2025 | 05:51 PM
మన దేశంలో చాలా మంది అద్భుతమైన తెలివితేటలు ఉపయోగిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనిపెడుతుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
మన దేశంలో చాలా మంది అద్భుతమైన తెలివితేటలు ఉపయోగిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనిపెడుతుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన జనాలు అతడి తెలివిని ప్రశంసిస్తున్నారు (viral video).
mr_umesh0018 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సాధారణంగా 20 లీటర్ వాటర్ క్యాన్ నుంచి నీటిని గ్లాస్‌లోకి తీసుకోవాలంటే కాస్త బలం ఉపయోగించాలి. ఆ క్యాన్‌ను కిందకు వంచి గ్లాస్‌లోకి నీటిని వేసుకోవాలి. లేదంటే కాస్త డబ్బులు పెట్టి వాటర్ డిస్పెన్సర్ కొనుక్కోవాలి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన తెలివిని ఉపయోగించి సూపర్ ట్రిక్ కనిపెట్టాడు. ఒక లీటర్ కోక్ బాటిల్‌ను మధ్యలో కట్ చేసి ఆ వాటర్ క్యాన్ పైన పెట్టాడు. ఆ క్యాన్‌ను వంచినపుడు ఆ బాటిల్ గుండా నీరు సులభంగా గ్లాస్‌లో పడుతోంది (man extracts water with hack).
ఈ ట్రిక్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (20 liter bottle hack). వైరల్ అవుతున్న ఆ వీడియోను ఇప్పటివరకు ఏకంగా రెండు కోట్ల మందికి పైగా వీక్షించారు. దాదాపు 4 లక్షల మంది ఆ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. ఈ కుర్రాడికి కచ్చితంగా అవార్డు ఇవ్వాలని ఒకరు కామెంట్ చేశారు. ఈ టెక్నిక్ తెలియక ఇన్ని రోజులూ ఎంత కష్టపడ్డామో అంటూ ఒకరు సరదాగా వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
జిమ్‌లో హెవీ వెయిట్ లిఫ్టింగ్.. కంటి చూపు కోల్పోయిన యువకుడు..
అబ్బాయికి క్యాన్సర్.. అమ్మాయికి కిడ్నీ వైఫల్యం.. పెళ్లి తర్వాత ఏం జరిగిందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..