Share News

Heavy lifting vision loss: జిమ్‌లో హెవీ వెయిట్ లిఫ్టింగ్.. కంటి చూపు కోల్పోయిన యువకుడు..

ABN , Publish Date - Oct 29 , 2025 | 03:26 PM

సాధారణంగా ప్రతి రోజూ జిమ్ చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటారు. శరీరం కండలు తిరిగి ఫిట్‌గా మారుతుందని అందరూ అనుకుంటారు. అయితే జిమ్‌లో అతిగా కష్టపడడం వల్ల కంటి చూపు కోల్పోవడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?

Heavy lifting vision loss: జిమ్‌లో హెవీ వెయిట్ లిఫ్టింగ్.. కంటి చూపు కోల్పోయిన యువకుడు..
heavy lifting vision loss

సాధారణంగా ప్రతి రోజూ జిమ్ చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటారు. శరీరం కండలు తిరిగి ఫిట్‌గా మారుతుందని అందరూ అనుకుంటారు. అయితే జిమ్‌లో అతిగా కష్టపడడం వల్ల కంటి చూపు కోల్పోవడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? తాజాగా ఓ 27 ఏళ్ళ కుర్రాడికి అలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో ఆ వ్యక్తిని ట్రీట్ చేసిన డాక్టర్ ఆ ఘటన గురించి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అందరినీ హెచ్చరించారు (sudden blindness gym).


ఓ 27 ఏళ్ల యువకుడు జిమ్‌లో హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాడు. బరువు చాలా ఎక్కువగా ఉండడంతో అతడు తన శక్తినంతా ఉపయోగించి శ్వాసను బిగబట్టి లిఫ్ట్ చేశాడు. కాసేపటికి ఒక కన్ను దృష్టి కోల్పోయినట్టు అతడు గ్రహించాడు. ఆస్పత్రికి వెళ్లి టెస్ట్‌ చేయించుకోగా అతనికి వల్సాల్వా రెటినోపతి అనే అరుదైన వ్యాధి సోకినట్టు వైద్యులు గుర్తించారు. శారీరక వ్యాయామం సమయంలో ఒత్తిడి అకస్మాత్తుగా పెరగడం వల్ల కంటి రెటీనాలోని చిన్న రక్త నాళాలు పగిలిపోతాయి. ఫలితంగా చూపు కోల్పోవడం జరుగుతుంది (eye pressure workout).


ఎవరైనా వ్యక్తి భారీ బరువులు ఎత్తేటప్పుడు లేదా అధికంగా శక్తిని ప్రయోగించేటప్పుడు శ్వాసను బిగబడుతుంటారు (retinal damage exercise). అలాంటి సందర్భాల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. కంటిలో రక్తం పేరుకుపోతుంది. దీనివల్ల దృష్టి సమస్యలు వస్తాయి. చాలా సందర్భాలలో ఈ సమస్య కొన్ని వారాలలోనే దానంతట అదే పరిష్కారమవుతుంది. ఒక్కోసారి మాత్రం చికిత్స చేయకపోతే తీవ్రంగా మారుతుంది. అందుకే డెడ్ లిఫ్టింగ్, స్క్వాట్‌లు చేస్తున్న సమయంలో ఊపిరి బిగబట్టడం, సామర్థ్యానికి మించిన బరువులు ఎత్తడం వంటివి చేయకూడదని డాక్టర్ సూచించారు.


ఇవి కూడా చదవండి..

రెస్టారెంట్‌లో చోరీకి వచ్చిన జంట.. దొంగతనానికి ముందు వారేం చేశారంటే..


మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 40 సెకెన్లలో కనిపెట్టండి


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 29 , 2025 | 03:41 PM