Romantic Theft: రెస్టారెంట్‌లో చోరీకి వచ్చిన జంట.. దొంగతనానికి ముందు వారేం చేశారంటే..
ABN , Publish Date - Oct 29 , 2025 | 02:59 PM
అమెరికాలోని అరిజోనా నుంచి ఓ వింత వార్త వెలుగులోకి వచ్చింది. ఒక జంట రెస్టారెంట్‌లోకి చొరబడి దొంగతనం చేసింది. అయితే చోరీకి ముందు వారు ఆ రెస్టారెంట్‌లో చేసినది చూసి పోలీసులు కూడా షాకయ్యారు. వారి నిర్వాకం మొత్తం ఆ రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
అమెరికాలోని అరిజోనా నుంచి ఓ వింత వార్త వెలుగులోకి వచ్చింది. ఒక జంట రెస్టారెంట్‌లోకి చొరబడి దొంగతనం చేసింది. అయితే చోరీకి ముందు వారు ఆ రెస్టారెంట్‌లో చేసినది చూసి పోలీసులు కూడా షాకయ్యారు. వారి నిర్వాకం మొత్తం ఆ రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది (couple robbery).
అరిజోనాలోని మోన్ చెరి రెస్టారెంట్ ఎంతో అందంగా అలంకరించి ఉంటుంది. ప్రేమికులకు ఈ రెస్టారెంట్ ఎంతో ప్రసిద్ధి. ఈ రెస్టారెంట్ మూసివేసి ఉన్న సమయంలో రెండ్రోజుల క్రితం ఒక యువకుడు తన ప్రేయసితో కలిసి చొరబడ్డాడు. తెల్లవారుఝామున 3:50 గంటలకు వారు లోపలికి వెళ్లారు. ముందుగా ఆ రెస్టారెంట్‌లో వారిద్దరూ శృంగారం సాగించారు. వారిద్దరూ తమ ఫేస్ మాస్క్‌లను కూడా తొలగించి రాసక్రీడలో పాల్గొన్నారు. అనంతరం క్యాష్ కౌంటర్ నుంచి 38 వేల రూపాయలు చోరీ చేశారు (shocking CCTV footage).
డబ్బులతో పాటు ఒక ఐఫోన్‌ను, ఒక మద్యం బాటిల్‌ను కూడా దొంగిలించారు (bizarre robbery). అంతేకాకుండా ఆ రెస్టారెంట్‌లోని రెండు తలుపులను ధ్వంసం చేశారు. తర్వాతి రోజు ఉదయం రెస్టారెంట్‌ను ఓపెన్ చేసిన యజమాని దొంగతనం జరిగినట్టు గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి ఆ జంట చేసిన పని చూసి నివ్వెరపోయారు. ఆ దొంగల మొహాలు ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పోలీసులు వారిని వెతికే పనిలో నిమగ్నమయ్యారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఇదెక్కడి స్టంట్.. చివరకు ఆ అమ్మాయి పరిస్థితి ఏమైందో చూడండి..
మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని ఐదు తేడాలను 37 సెకెన్లలో కనిపెట్టండి
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..