Share News

Kolkata Horse Heatstroke Incident: ఎండ దెబ్బతో మూర్ఛపోయిన గుర్రం.. అయినా దాన్ని హింసించిన యజమాని

ABN , Publish Date - May 04 , 2025 | 07:55 AM

ఎండ దెబ్బ తాళలేక కింద పడిపోయిన ఓ గుర్రాన్ని దాని యజమాని మరింతగా హింసించిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Kolkata Horse Heatstroke Incident: ఎండ దెబ్బతో మూర్ఛపోయిన గుర్రం.. అయినా దాన్ని హింసించిన యజమాని

ఇంటర్నెట్ డెస్క్: కొందరి గొప్పదనం చూస్తే చేతులెత్తి నమస్కరించాలని అనిపిస్తుంది. మరికొందరిని చూస్తే రోత పుడుతుంది. మనుషుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అని అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రెండో రకం వ్యక్తిని చూసి జనాలు ఈసడించుకుంటున్నారు. ఇంతటి కఠిన హృదయం గలవారు మన మధ్య ఉన్నారన్న విషయం ఊహించుకుంటేనే భయం వేస్తోందని కామెంట్ చేస్తున్నారు. ఓ గుర్రం ఎండ దెబ్బ తిగిలి నడి రోడ్డు మీదే కుప్పకూలిపోతే బగ్గీ నిర్వాహకుడు మాత్రం ఆ జంతువును కొట్టి లేపే ప్రయత్నం చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.


కోల్‌కతాలోని భవానీపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, బగ్గీ నిర్వాహకుడు కింద పడిపోయిన గుర్రాన్ని ముఖంపై చేయితో కొట్టి లేపే ప్రయత్నం చేశాడు. అది ఎండదెబ్బకు కింద పడి నరకం అనుభవిస్తోందని తెలిసినా అతడి మనసు కరగలేదు. గుర్రానికి కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. పైపెచ్చు దాని ముఖంపై చేయితో చరుస్తూ లేపే ప్రయత్నం చేశాడు. అది లేవలేక అవస్థ పడుతున్నా అతడి మనసు మాత్రం కరగలేదు. దానికి కాస్త నీళ్లు ఇద్దామన్న సోయ కూడా లేకుండా గుర్రాన్ని హింసించాడు.


పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ టూవర్డ్స్ యానిమల్స్ ఈవీడియోని పోస్టు చేసింది. ఈ వీడియో చూసిన వారందరూ నెట్టింట ఓ రేంజ్‌లో కామెంట్ చేశారు. గుర్రపు బగ్గీ యజమానిని తిట్టిపోస్తున్నారు. ‘‘ ఎండలో తిండీ నీరు లేక సొమ్మసిల్లి పడిపోయిన జంతువును ఇంతలా హింసిస్తున్నాడు.. ఇతడు అసలు మనిషేనా అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక ఘటనపై తాము కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పెటా కూడా పేర్కొంది. ఈ ఘటనపై నెట్టింట జనాల నుంచి ఒత్తిడి పెరగడంతో కోల్‌కతా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఆ గుర్రానికి పశువైద్యుడి ఆధ్వర్యంలో చికిత్స జరుగుతోందని అన్నాడు. ఇక ఘటనపై వేగంగా స్పందించిన కోల్‌కతా పోలీసులకు పెటా ధన్యవాదాలు తెలిపింది. ఇలా రకరకాల కామంట్స్ మధ్య ఈ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి:

వాన పడుతోందని వర్క్ ఫ్రమ్ హోం అడిగిన ఉద్యోగి.. చివరకు జరిగిందంటే..

మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..

అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు

Read Latest and Viral News

Updated Date - May 04 , 2025 | 07:55 AM