Share News

తాగడం కాదు... ఆస్వాదించండి

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:16 PM

ఉదయం ఉత్తేజకరంగా ప్రారంభించాలన్నా... పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందాలన్నా... కాలక్షేపానికి నాలుగు మాటలు మాట్లాడుకోవాలన్నా ‘టీ’ని ఆశ్రయిస్తారు చాలామంది. అయితే అందరూ టీ తాగుతారు. జపనీయులు మాత్రం టీని ఆస్వాదిస్తారు. టీ తాగడాన్ని ఒక ఉత్సవంలా జరుపుకొంటారు.

తాగడం కాదు... ఆస్వాదించండి

ఉదయం ఉత్తేజకరంగా ప్రారంభించాలన్నా... పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందాలన్నా... కాలక్షేపానికి నాలుగు మాటలు మాట్లాడుకోవాలన్నా ‘టీ’ని ఆశ్రయిస్తారు చాలామంది. అయితే అందరూ టీ తాగుతారు. జపనీయులు మాత్రం టీని ఆస్వాదిస్తారు. టీ తాగడాన్ని ఒక ఉత్సవంలా జరుపుకొంటారు.

సంప్రదాయబద్ధంగా టీ తయారు చేసుకోవడం, టీ తాగడం జపాన్‌ సంస్కృతిలో ప్రధాన భాగం. ఒకాకురా కకుజో అనే రచయిత ‘బుక్‌ ఆఫ్‌ టీ’ అని తేనీటి పానీయం గురించి ఏడు అధ్యయాల పుస్తకమే రాసాడంటే జపాన్‌ ప్రజలు టీని ఎంతగా ప్రేమిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ పుస్తకంలో ‘ద కప్‌ ఆఫ్‌ హ్యుమానిటీ’ పేరుతో మొదటి అధ్యాయం మొదలవుతుంది. నాగరికత పరిణామక్రమంలో టీ ప్రాధాన్యతను ఇందులో చక్కగా వర్ణించాడు రచయిత.


టీ పట్ల తూర్పు దేశాలవారి ఆరాధనా భావాన్ని కొనియాడడంతో పాటు, టీ పట్ల పశ్చిమ దేశాలవారి సాధారణ దృష్టిని నిరసిస్తాడు. ఇక ‘స్కూల్స్‌ ఆఫ్‌ టీ’ అనే రెండో అధ్యాయంలో Boiled Tea, Whipped Tea, Steeped Tea అని టీలో రకాలు చెప్పాడు. Boiled Tea అంటే టీ ఆకుల్ని ఉడికించి ఆ రసాన్ని తాగడం. Boiled Tea అంటే టీ పొడిని నీటిలో మరగించి నురుగు వచ్చాక వడపోసుకుని Whipped Tea అంటే టీ ఆకుల్ని వేడి నీటిలో నానబెట్టి, ఆ రసాన్ని తాగడం. జపాన్‌ టీ చరిత్రలో ఇదే ప్రాచీనమైన టీ పద్ధతి.

‘టావోయిజం మరియు జెనిజం’ అనేది (Taoism and Zennism) మూడో అధ్యాయం. ఇందులో టీ తాగే గదుల వాతావరణం గురించి ఉంటుంది. ‘టావోయిజం’ అంటే మనిషి ప్రకృతితో మమేకమవడం. ‘జెనిజం’ అంటే సాధారణ స్థాయి (Simplicity). సహజమైన పాకృతిక వాతావరణంలో టీ ఆస్వాదించడం వారికి గొప్ప వేడుక.


నాలుగో విభాగంలో టీ గదిలో అలంకరణ గురించి చెప్పాడు. ఒకటి లేదా రెండు పూలగుచ్ఛాలు మాత్రమే ఆ గదిలో ఉండాలి. ఆ గదిలో టీ తాగే వారి దృష్టి, మనస్సూ కేవలం ఆ పూలూ... వాటి సౌందర్యం మీదే ఉండాలి. జపాన్‌ వారి పూల అమరిక కళ ‘ఇకేబానా’ (Ikenbana) అని అందరికీ తెలసిందే. ఈ అద్భుతమైన కళ గురించీ, పూలను పాత్రల్లో అలంకరించే కళ గురించి అయిదూ ఆరూ అధ్యాయాల్లో ఉంది. పూలైనా ఆకులైనా వాటి సహజ సిద్ధమైన రూపాల్ని కోల్పోకూడదంటాడు రచయిత.


book12.2.jpg

చివరి అధ్యాయం టీ మాస్టర్ల గురించి ఉంటుంది. ‘వారు కేవలం టీ తయారు చేసేవారు కాదు. టీ సంప్రదాయంలో అనుభవజ్ఞులైన తత్వవేత్తలు’ అంటాడు రచయిత. దైనందిన జీవితంలోని భౌతిక భారాన్ని తొలగించడానికి జపాన్‌ ప్రజలకు ఈ టీ వేడుకలుగొప్ప ఉపశ మనమని బోధిస్తుంది ‘బుక్‌ ఆఫ్‌ టీ’. ఒకాకురాకకుజో ‘ద ఐడియల్స్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’, ‘ద అవేకినింగ్‌ ఆఫ్‌ జపాన్‌’ వంటి పుస్తకాలూ రాశాడు. వాటికి రాని ప్రాచుర్యం తేనీటి రకాలు, వాటిని ఆస్వాదించే పద్ధతుల గురించి పేర్కొన్న ఈ ‘బుక్‌ ఆఫ్‌ టీ’కి రావడం విశేషం.

- డా.బండి సత్యనారాయణ, విశాఖపట్నం


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరలకు రెక్కలు.. నేటి ధరలు చూస్తే..

విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 12 , 2025 | 01:16 PM