Italian Woman-Indian Husband: భారతీయ మహిళ దుమ్ము దులిపేసిన ఇటలీ వనిత.. తన భర్తను అవమానించిందని..
ABN , Publish Date - Sep 12 , 2025 | 03:31 PM
భారతీయుడైన తన భర్తను ట్రోల్ చేసిన మరో భారతీయ మహిళను నెట్టింట దుమ్ము దులిపేసిందో ఇటలీ వనిత. ఇందుకు సంబంధించి పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అనేక మంది భారతీయులు ఇటలీ మహిళకు అండగా నిలిచారు.
ఇంటర్నెట్ డెస్క్: తన భర్తను అవమానించిన ఓ భారతీయురాలిని దుమ్ము దులిపేసిందో ఇటలీ మహిళ! ఆమె ఫొటోలతో సహా నెట్టింట షేర్ చేసి జీవితంలో ఎన్నడూ మరిచిపోలేని గుణపాఠం చెప్పింది. భారతీయుడిని పెళ్లాడినందుకు తనను మరో భారతీయులు ట్రోల్ చేసిందని చెప్పింది. అకారణ ద్వేషానికి జాతిభేదాలు ఉండవని చెప్పుకొచ్చింది. ఎలీ అనే మహిళ పెట్టిన ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది (Italian woman defends Indian husband).
ఎలీ తన భర్త జాన్‌తో కలిసి దుబాయ్‌లో ఉంటోంది. జాన్ భారతీయుడు. తమ బంధం గురించి నిత్యం సోషల్ మీడియాలో వెగటు పుట్టించే కామెంట్స్ ఎదురవుతుంటాయని ఎలీ చెప్పుకొచ్చింది. అనేక మంది జాత్యాహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తుంటారని తెలిపింది. తాజాగా ఓ భారతీయ మహిళ తనను హేళన చేస్తూ పెట్టిన పోస్టును షేర్ చేసింది. ‘పాపం.. చివరకు నువ్వు ఓ భారతీయుడితో సెటిల్ అయ్యావా.. వాళ్లు వేస్ట్’ అంటూ ఆ భారతీయ మహిళ ఎలీని ట్రోల్ చేసింది. ఈ పోస్టును ఎలీ యథాతథంగా నెట్టింట పంచుకుంది (viral post trolling marriage).
‘ఇలాంటి వారిని చూసీచూడనట్టుగా వదిలేసే బదులు వారి బండారం బయటపెట్టాలని అనిపించింది. వీళ్లు నిజంగా ఎంత నీచంగా ఉంటారో ప్రపంచానికి చెప్పాలని అనుకున్నాము. మా ప్రయాణం మాత్రం ఎప్పటికీ ఇలాగే సాగుతుంది. ద్వేషం కంటే ప్రేమ ఎంతో ఉన్నతమైనది. మాలాగా అకారణ ద్వేషానికి గురైన వారి కోసమే ఈ ఉదంతాన్ని షేర్ చేస్తున్నాము’ అని ఆ ఎలీ పోస్టు పెట్టింది. తనను ట్రోల్ చేసిన భారతీయ మహిళ ఫొటోను కూడా నెట్టింట పంచుకుంది (Eli John Dubai couple story).
ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ‘ఆమె బాగా ధనవంతురాలై ఉంటుంది. అందుకే భారతీయురాలైనా తోటి భారతీయుడిపై ద్వేషం వెళ్లగక్కింది’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ‘ఇలాంటి వాళ్ల మాటలపై నీ టైం వేస్టు చేసుకోకు’ అని మరో భారత సంతతి మహిళ ఎలీకి రిప్లై ఇచ్చింది. ఆమె నేరుగా ఎలీ భర్తను ట్రోల్ చేసి ఉండకపోవచ్చని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు. తన జీవితంలో భారతీయ పురుషులు మిగిల్చిన చేదు అనుభవాల కారణంగా ఆమె నెట్టింట ఈ కామెంట్ చేసి ఉండొచ్చని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
వందేభారత్ రైల్లో ప్రయాణికుడి అరాచకం.. నెట్టింట వెల్లువెత్తుతున్న విమర్శలు
బిలియనీర్‌ల సక్సెస్‌కు కారణం ఇదీ.. సీక్రెట్ చెప్పిన న్యూరాలజిస్టు